ఏపీలో విద్యుత్ సంస్థల్లో ఆరు మాసాల పాటు సమ్మెలపై నిషేధం

By narsimha lodeFirst Published Apr 16, 2020, 5:54 PM IST
Highlights
ఏపీ రాష్ట్రంలో విద్యుత్ సంస్థల్లో ఆరు మాసాల పాటు సమ్మెను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో విద్యుత్ సమస్యలు ఎదురుకాకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. 

అమరావతి: ఏపీ రాష్ట్రంలో విద్యుత్ సంస్థల్లో ఆరు మాసాల పాటు సమ్మెను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో విద్యుత్ సమస్యలు ఎదురుకాకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. 

రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ మిషన్ కార్పోరేషన్ పరిధిలో ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ సంస్థల పరిధిలో సమ్మెను ఆరు మాసాల పాటు నిషేధిస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మెడికల్, హెల్త్ ఉద్యోగులను ఎస్మా పరిధిలోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఈ జీవోను అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా విద్యుత్ సంస్థల్లో కూడ ఇదే అమలు చేయనుంది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.

ఏపీ రాష్ట్రంలో ఇప్పటివరకు 534 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ సోకి ఇప్పటివరకు 14 మంది మృతి చెందారు., రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఎక్కువగా 122 కేసులు నమోదయ్యాయి.
also read:కరోనా: మే 31వరకు సేవా,దర్శన డబ్బులు రీఫండ్, భక్తులకు వెంకన్న దర్శనం లేనట్టేనా?

గుంటూరు తర్వాతి స్థానంలో కర్నూల్ జిల్లా నిలిచింది. రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరించకుండా ఉండేందుకు గాను  ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుంది.రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం నాడు కరోనా నివారణపై సమీక్ష నమావేశం నిర్వహించారు.

 
click me!