ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఈ నెల 30న భ్రమరాంబికా దేవికి కుంభోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేశారు. శ్రీశైలంలో జంతు, పక్షి బలులు నిషేధిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఈ నెల 30న భ్రమరాంబికా దేవికి కుంభోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేశారు. శ్రీశైలంలో జంతు, పక్షి బలులు నిషేధిస్తున్నట్లు వెల్లడించారు. కుంభోత్సవం రోజున భక్తులు ఆలయ పరిధిలో జంతుబలులు చేయరాదని హెచ్చరించారు. కోవిడ్ నిబంధనలు పాటించే భక్తులకే ఆలయ ప్రవేశం వుంటుందని ఈవో తెలిపారు.
రోజు రోజుకు చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనాను ధీటుగా ఎదుర్కొనేందుకు అత్యవసరమైతే తప్పా ఎవ్వరు కూడా ఇంటి నుండి బయటకు రావద్దని ఈవో రామారావు కోరారు. శ్రీశైల మండల పరిధిలోని పలు గ్రామాల్లో కొవిడ్ లక్షణాలు ఎక్కువగా ఉండటంతో ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోడంతో పాటు వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన సూచించారు.
Also Read:విజయవాడలో ప్రమాద ఘంటికలు... హాస్పిటల్స్ లో మరో నాలుగు గంటలకే ఆక్సిజన్
తహశీల్దార్ ఆదేశాల మేరకు శ్రీశైల దేవస్థాన పరిధిలో మధ్యాహ్నం నుండి వర్తక వ్యాపారాలు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు రామారావు చెప్పారు. ఆలయ ప్రవేశం మెదలు భక్తులు బయటకు వచ్చే వరకు కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.
క్యూలైన్ల వద్ద థర్మల్ గన్‌తో స్క్రీనింగ్ చేస్తున్నట్లు ఈవో తెలిపారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చే యాత్రికులు స్వామి, అమ్మవార్ల దర్శనానంతరం స్వస్థలాలకు తిరిగి వెళ్లాల్సిందిగా ఈవో రామారావు కోరారు.