హిందూత్వం తప్ప దేశ క్షేమం బీజేపీకి పట్టదు: ఎంపీ కనిమొళి, సీఎం రమేష్‌కు సంఘీభావం

First Published Jun 26, 2018, 4:04 PM IST
Highlights

సీఎం రమేష్ దీక్షకు డీఎంకె మద్దతు

కడప: కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిని డీఎంకె నేత, ఎంపీ కనిమొళి మంగళవారం నాడు పరామర్శించారు.  కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం రమేష్, బీటెక్ రవి  ఆమరణ నిరహారదీక్ష ఇవాళ్టికి ఆరు రోజులకు చేరుకొంది. 

ఏపీ రాష్ట్ర హాక్కుల పోరాటానికి తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు.  రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆనాడూ రాజ్యసభలో సీఎం రమేష్ పోరాటం చేశారని ఆమె గుర్తు చేశారు. 

కేంద్ర ప్రభుత్వం తాను ఇచ్చిన మాట ప్రకారం ఏపీ రాష్ట్రానికి విభజన చట్టంలోని హమీలను అమలు చేస్తే ప్రజలు సంతోషంగా ఉండేవారని ఆమె అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన హమీలను అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.  బీజేపీకి హిందూత్వం తప్ప దేశ క్షేమం గురించి పట్టదని ఆమె విమర్శించారు. 

ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్సీ ఆరోగ్యం క్షీణిస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ఇప్పటికైనా జోక్యం చేసుకోవాలని  ఆమె కోరారు.

click me!