పోటీపై క్లారిటీ ఇచ్చిన సినీనటి దివ్యవాణి

Published : Jan 29, 2019, 08:03 PM IST
పోటీపై క్లారిటీ ఇచ్చిన సినీనటి దివ్యవాణి

సారాంశం

తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ పనితీరును ప్రశంసించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను ఢీ కొట్టేందుకు తెలుగుదేశం పార్టీ దివ్యవాణిని తెరపైకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో తాను ఎక్కడ నుంచీ పోటీ చేయడం లేదని ఆమె స్పష్టం చేశారు. 

విజయవాడ: రాబోయే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చెయ్యాలో అనే అంశంపై సినీనటి, టీడీపీ నేత దివ్యవాణి క్లారిటీ ఇచ్చేశారు. రాబోయే ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి రోజాకు పోటీగా పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. ఈ వార్తల నేపథ్యంలో దివ్యవాణి పోటీపై ఆసక్తి నెలకొంది. 

తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ పనితీరును ప్రశంసించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను ఢీ కొట్టేందుకు తెలుగుదేశం పార్టీ దివ్యవాణిని తెరపైకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో తాను ఎక్కడ నుంచీ పోటీ చేయడం లేదని ఆమె స్పష్టం చేశారు. 

రాబోయే రోజుల్లో తాను ఎక్కడ నుంచి పోటీ చెయ్యబోనని అయితే తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీలో కార్యకర్తగా పని చేస్తానని చెప్పుకొచ్చారు. మాటలు చెప్పడానికి చాలా పార్టీలు ఉన్నాయని కానీ పని చేసే ఏకైక పార్టీ టీడీపీయేనని ఆమె స్పష్టం చేశారు. మళ్లీ చంద్రబాబు పాలనకే పట్టం కట్టాలని ఏపీ ప్రజలకు దివ్యవాణి పిలుపునిచ్చారు.

ఈ వార్తలు కూడా చదవండి

నేతాజీ సుభాష్ చంద్రబోస్, లోకేష్ ఒకే రోజు పుట్టడం సంతోషం: సినీనటి దివ్యవాణి

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!