మా కూతురిని చంపినట్టే అతడిని చంపండి: నాగేంద్ర కామెంట్స్ పై దివ్య పేరేంట్స్

Published : Oct 16, 2020, 11:55 AM IST
మా కూతురిని చంపినట్టే అతడిని చంపండి:  నాగేంద్ర కామెంట్స్ పై దివ్య  పేరేంట్స్

సారాంశం

హత్య నేరాన్ని కప్పిపుచ్చుకొనేందుకు నాగేంద్ర పెళ్లి డ్రామా ఆడుతున్నాడని దివ్య పేరేంట్స్ ఆరోపించారు.  

విజయవాడ: హత్య నేరాన్ని కప్పిపుచ్చుకొనేందుకు నాగేంద్ర పెళ్లి డ్రామా ఆడుతున్నాడని దివ్య పేరేంట్స్ ఆరోపించారు.

శుక్రవారం నాడు దివ్య పేరేంట్స్ ఓ తెలుగు న్యూస్ ఛానెల్ తో దివ్య పేరేంట్స్ మాట్లాడారు.నిద్రపోతున్న అమ్మాయిని బంధించి దారుణంగా హత్య చేశాడని వారు చెప్పారు.తమ కూతురిని చంపినట్టుగా నాగేంద్రను కూడ చంపేయాలని వారు డిమాండ్ చేశారు.

also read:ఎవరి గొంతు వాళ్లే కోసుకొన్నాం, కలిసి చనిపోదామనే ఇలా: దివ్య మృతిపై నాగేంద్రబాబు

ఎవరిని కూడ ప్రేమించినట్టుగా దివ్య తమతో చెప్పలేదని పేరేంట్స్ గుర్తు చేసుకొన్నారు. ఫలానా వ్యక్తిని పెళ్లి చేసుకొంటానని కూడ ఏనాడూ చెప్పలేదన్నారు.దివ్యను చంపాలని ప్లాన్ చేసుకొని హత్య చేశారన్నారు. ఈ ప్లాన్ లో భాగంగానే ఫోటోలను కూడ నాగేంద్రబాబు సృష్టించాడని దివ్య పేరేంట్స్ ఆరోపించారు.

ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గుర్తించి నాగేంద్ర తమ కూతురిని ఇంట్లో తలుపులు వేసి బంధించి దారుణంగా హత్య చేశాడని వారు చెప్పారు. తమ కూతురిని నాగేంద్ర హత్య చేయడాన్ని ఆ కుటుంబానికి చెందిన వారు ఎవరైనా తప్పుబట్టారా అని ఆయన ప్రశ్నించారు. దివ్యను పెళ్లి చేసుకొన్నానని చెప్పి కేసు నుండి బయటపడేందుకు నాగేంద్ర ప్రయత్నిస్తున్నాడని వారు ఆరోపించారు. 

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?