DishaCaseAccusedEncounter:ఈ ఎన్‌కౌంటర్ సమర్థనీయమే: సిపిఐ నారాయణ

By Arun Kumar PFirst Published Dec 6, 2019, 2:01 PM IST
Highlights

తెలంగాణలో సంచలనంగా మారిన దిశ హత్యాచారం ఘటనలో పోలీసుల చర్య మరింత సంచలనంగా మారింది. ఈ దారుణానికి పాల్పడ్డ నలుగురు నిందితులు పోలీసులు ఎన్కౌంటర్ లో హతమయ్యారు.  

హైదరాబాద్: శంషాబాద్ లో ఇటీవల అత్యంత దారుణంగా హత్యాచారానికి గురయిన దిశ దుర్ఘటనలో తెలంగాణ పోలీసుల చర్యలను సిపిఐ నాయకులు నారాయణ సమర్థించారు. హత్యాచార ఘటనకు పాల్పడిన నిందితులపై జరిగిన ఎన్‌కౌంటర్ పై ఆయన స్పందిస్తూ... బాధితురాలికి సత్వర న్యాయం జరిగేలా పోలీసులు తీసుకున్న నిర్ణయం వుందన్నారు.  

నిందితులపై జరిగిన ఎన్ కౌంటర్ సమర్థనీయమేనని నారాయణ పేర్కొన్నారు. మరోసారి ఇలాంటి అఘాయిత్యాలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇలాంటి శిక్షలు వుండాలన్నారు. ఈ ఎన్ కౌంటర్‌ను సీపీఐ కూడా సమర్ధిస్తుందని వెల్లడించారు. 

దిశ హత్యకేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై మంత్రి గంగుల కమలాకర్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదీ తెలంగాణ పోలీసుల సత్తా అంటూ కొనియాడారు.
నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అడబిడ్డలకు తెలంగాణ సేఫ్ జోన్ అని చెప్పుకొచ్చారు. మహిళల వైపు చూడాలంటే వణుకు పుట్టాలి అంటూ హెచ్చరించారు. 

 read more దిశ నిందితుల ఎన్ కౌంటర్: ఎన్ కౌంటర్ జరిగిన చోటే పోస్టుమార్టం

అల్లరిమూకల ఆగడాలకు తెలంగాణలో స్థానం లేదనడానికి ఈ ఎన్ కౌంటర్ ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. అంబేద్కర్ వర్థంతి రోజున ఆయనకు ఇదే నిజమైన నివాళి అని అన్నారు మంత్రి గంగుల కమలాకర్.

ఇకపోతే తెలంగాణ వైద్యురాలు దిశను గతనెల 27న రాత్రి రేప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు నలుగురు నిందితులు. కేసు నమోదు చేసిన షాద్ నగర్ పోలీసులు ఘటనపై విచారణ చేపట్టి 24 గంటల్లోనే దారుణానికి ఒడిగట్టిన నలుగురు నిందితులు ముహ్మద్ ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులను అరెస్ట్ చేశారు. 

ఈ కేసులో చర్లపల్లిలో జైల్లో ఉన్న నిందితులను గురువారం రాత్రి పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కేసు రీ కనస్ట్రక్షన్ లో భాగంగా ఎక్కడైతే దిశను అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి తగులబెట్టారో ఆ ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. 

read more దిశ నిందితుల ఎన్ కౌంటర్: పంచనామా పూర్తి, ఘటనా స్థలానికి నిందితుల తల్లిదండ్రులు

పోలీసులు కేసు విచారణకు సంబంధించి ఆధారాలు సేకరిస్తుండగా పోలీసులపై రాళ్లు రువ్వి తప్పించుకునే ప్రయత్నం చేశారు నిందితులు. దాంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో నలుగురు నిందితులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. 


 

click me!