కేఏపాల్ కాళ్లు పట్టుకున్న ఆర్జీవీ..?

Published : Jan 16, 2019, 09:50 AM IST
కేఏపాల్ కాళ్లు పట్టుకున్న ఆర్జీవీ..?

సారాంశం

వావ్! ఆర్జీవీ ముంబై హోటల్‌లో నన్ను కలిసి నా పాదాలకు వినయపూర్వకంగా నమస్కారం చేశారు. తాను అలా తన గురువు దాసరిగారికి కూడా ఎప్పుడూ చేయలేదని చెప్పారు. ఇది చూసిన జ్యోతి, వెంకట్ షాక్ అయ్యారు. 

ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. గత కొద్ది కాలంగా ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏపాల్ పై ట్విట్టర్ వేదికగా విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు ఆ విమర్శలు తీవ్రస్థాయికి చేరాయి. ఒకరిపై మరొకరు కౌంటర్ వేసుకునే స్థాయికి వెళ్లిపోయారు.

ఇంతకీ మ్యాటరేంటంటే...‘కేఏ పాల్ మోదీ, చంద్రబాబు వంటి చిన్న చిన్న లీడర్లపై పోటీ చేసేకంటే.. జీసస్‌ని ఓ ప్రపంచాన్ని సృష్టించమని కోరి దానికి అధ్యక్షుడు అయిపోవచ్చు’ అని ట్వీట్ చేశారు. దీనికి కౌంటర్‌గా.. పాల్ ఆర్జీవీ తనను ముంబై హోటల్‌లో కలిశారని.. తన కాళ్లు పట్టుకున్నారని వెల్లడిస్తూ ఓ ఫోటోను విడుదల చేశారు.
 
‘వావ్! ఆర్జీవీ ముంబై హోటల్‌లో నన్ను కలిసి నా పాదాలకు వినయపూర్వకంగా నమస్కారం చేశారు. తాను అలా తన గురువు దాసరిగారికి కూడా ఎప్పుడూ చేయలేదని చెప్పారు. ఇది చూసిన జ్యోతి, వెంకట్ షాక్ అయ్యారు. నన్ను నా ఏపీ ప్రజలు నాలుగు నెలల్లో సీఎంని చేయగానే... మేము ఈ ప్రపంచంలోనే ది బెస్ట్ అని నిరూపించుకుంటాం. అప్పుడు దేశం గురించి చూస్తాం’ అని ట్వీట్ చేశారు. 

దీనికి కౌంటర్‌గా ఆర్జీవీ.. ‘ప్రభువా! నేను పాల్ కాళ్లు ముట్టుకోలేదు. జస్ట్ పట్టుకుని వెనక్కి లాగితే వెనక్కి పడి తన నేల కేసి కొట్టుకుని తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా.. కానీ మీరు హర్ట్ అవుతారేమోనని వదిలేశా’ అని కామెంట్ పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్స్ వైరల్ గా మారాయి. 

 

PREV
click me!

Recommended Stories

వెన్నుపోటు పరిపాలన: మార్గాన్ని భరత్ | Margani Bharat Fires on Chandrababu | Asianet News Telugu
Jogi Ramesh Open Challenge: టైం, డేట్ చెప్పు నేను రెడీ లోకేష్ కి జోగిరమేష్ ఛాలెంజ్| | Asianet Telugu