ప్రణయ్ తరహాలో హత్య: గుంటూరులో యువకుడికి బెదిరింపులు

Published : Sep 22, 2020, 12:22 PM IST
ప్రణయ్ తరహాలో హత్య: గుంటూరులో యువకుడికి  బెదిరింపులు

సారాంశం

ప్రేమ వివాహం చేసుకొన్న దిలీప్ అనే యువకుడికి అతడి భార్య తరపు కుటుంబసభ్యుల నుండి బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఈ విషయమై బాదిథుడు ఎస్పీని ఆశ్రయించాడు.


గుంటూరు: ప్రేమ వివాహం చేసుకొన్న దిలీప్ అనే యువకుడికి అతడి భార్య తరపు కుటుంబసభ్యుల నుండి బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఈ విషయమై బాదిథుడు ఎస్పీని ఆశ్రయించాడు.

ఈ ఏడాది జూలై మాసంలో దిలీప్, సౌమ్యలు ప్రేమ వివాహం చేసుకొన్నారు. ఈ పెళ్లి సౌమ్య కుటుంబసభ్యులకు ఇష్టం లేదు. పెళ్లైన తర్వాత  సౌమ్య దిలీప్ ఇంటివద్దే ఉంటుంది. విజయవాడకు చెందిన సౌమ్య కుటుంబసభ్యులు దిలీప్ కుటుంబసభ్యులను బెదిరిస్తున్నారు.

మంగళవారం నాడు దిలీప్ కుటుంబసభ్యులను కొట్టి సౌమ్యను తీసుకెళ్లారు. మిర్యాలగూడలో ప్రణయ్ ను  హత్య చేసినట్టుగానే  హత్య చేయిస్తామని తనను బెదిరించారని సౌమ్య కుటుంబసభ్యులపై దిలీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

సౌమ్య కుటుంబసభ్యులతో తనకు ప్రాణహాని ఉందని దిలీప్ గుంటూరు ఎస్పీని ఆశ్రయించారు. తనకు రక్షణ కల్పించాలని ఆయన కోరాడు. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు