'భూమా' కుటుంబంలో మరోమారు రచ్చకెక్కిన విభేదాలు

Published : Apr 15, 2023, 04:00 PM ISTUpdated : Apr 15, 2023, 04:10 PM IST
'భూమా' కుటుంబంలో మరోమారు రచ్చకెక్కిన విభేదాలు

సారాంశం

ఆళ్లగడ్డ అంటే.. భూమా ఫ్యామిలీకి కంచుకోట. అలాంటి కోటకు బీటలు వారుతున్నాయనే అనుమానం పలువురులో వ్యక్తమవుతున్నాయి. తాజాగా మరోసారి భూమా కుటుంబంలో విభేదాలు బట్టబయలయ్యాయి. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే.. ఈ కథనాన్ని చదవాల్సిందే..   

కర్నూలు లోని ఆళ్లగడ్డ అంటే.. భూమా ఫ్యామిలీకి అడ్డా అనే పేరు. ఆ ప్రాంత రాజకీయమంతా ఆ కుటుంబం చుట్టూనే తిరిగేది. కానీ భూమా  నాగిరెడ్డి దంపతుల మరణం తర్వాత .. ఆ పరిస్థితి మారిపోయిందనే చెప్పాలి. ఇప్పడూ ఆ కుటుంబంలోని వివాదాల కేంద్రంగా అక్కడి రాజకీయం సాగుతోంది. రాజకీయ ఆధిపత్యంలో తలెత్తిన విభేదాలు, అఖిలప్రియ దూకుడు చర్యలు ఆ కుటుంబాన్ని తరచూ వివాదాలు, కేసుల్లోకి నెట్టడమే కాకుండా కుటుంబంలోనూ చిచ్చు పెట్టాయనే ప్రచారం సాగుతోంది.  తాజాగా మరోసారి భూమా కుటుంబంలో విభేదాలు బట్టబయలయ్యాయి. 

ఇటీవల భూమా కిషోర్ నిర్వహించిన ‘భూమా వర్గీయుల ఆత్మీయ సమ్మేళనం’ టీడీపీలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంగా మారింది. అదే సమయంలో చంద్రబాబు పార్టీలో కొత్త ప్రశ్నలు వెల్లువిరుస్తున్నాయి.
రానున్న  సార్వత్రిక ఎన్నికలలో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే.. ఆళ్లగడ్డలో కిషోర్‌ పోటీ చేస్తారా? లేదంటే.. కిషోర్ రెడ్డినే టీడీపీ అభ్యర్థిగా ప్రకటిస్తుందా? అనే చర్చ సాగుతోంది. మరోవైపు.. భూమా అఖిల, భార్గవ్ లను టార్గెట్ చేసుకున్ని కిషోర్‌ విమర్శలు చేశారు. 

ఇటీవల లోకేశ్‌ పాదయాత్ర జరుగుతున్న సమయంలో కిషోర్‌రెడ్డి సమావేశం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సమావేశంలో అఖిల, భార్గవ్ పై విమర్శలు గుప్పించడం, రానున్న ఎన్నికల బరిలో ఉంటానని స్వయంగా  ప్రకటించుకోవడంతో .. ఆళ్లగడ్డలో రాజకీయం హీటెక్కుతోంది.  అలాగే.. పొత్తులు ఉంటే బీజేపీ నుంచి.. లేదంటే ప్రజలను అనుకునే పార్టీ నుంచి బరిలో దిగుతానని ప్రకటించారు. పరోక్షంగా టీడీపీ తరపున  బరిలో దిగుతానని చెప్పకనే చెప్పేశారు. అయితే ..మరో వర్గం మాత్రం.. కిషోర్‌ ఏం మాట్లాడుతున్నారో తనకే స్పష్టత లేదని అభిప్రాయ పడుతోంది. తాను ఏ పార్టీ తరఫున పోటీ చేస్తానో తనకే స్పష్టత లేదనీ, అలాంటి వ్యక్తిని అసలు ఎవరు నమ్మరనే చర్చ కూడా మరో వైపు కొనసాగుతోంది. 

అయితే .. ఈ వ్యవహరాన్ని బీసీ జనార్దన్‌రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డిలు కిషోర్ రెడ్డి  వెనుక ఉండి నడిపిస్తున్నారని టాక్ వినిస్తోంది. అఖిలకు టిక్కెట్‌ రాకుండా వీరిద్దరూ పొత్తులు ఉంటే.. తాను బీజేపీ తరఫున పోటీ చేస్తాననీ,  లేదంటే టీడీపీ టిక్కెట్‌ దక్కేలా తెరవెనుక రాజకీయం చేస్తున్నాడని ఆ పార్టీ సీనియర్ నేతలు  భావిస్తున్నారు. 

ఇలా ఉంటే.. భూమా అఖిలప్రియ, భార్గవ్‌రామ్‌ పై కిషోర్‌  సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆళ్లగడ్డలో టీడీపీ  పరిస్థితి దారుణంగా తయారదనీ, పార్టీ పూర్తిగా బలహీనపడిందని విమర్శించారు. ఆళ్లగడ్డ రమేశ్‌రెడ్డి కమిషన్‌ ఇవ్వలేదని రూ.3కోట్లకు ఫోర్జరీ సంతకం చేస్తే..  చెక్‌బౌన్స్‌ అయిందని భార్గవ్‌ కేసు వేయించారని అన్నారు. చిన్నప్పటి నుంచి తన గుండెలపై ఎత్తుకుని పెంచిన రమేశ్‌రెడ్డికే  ఇలాంటి పరిస్థితి వస్తే..  కమీషన్‌ల కోసం కార్యకర్తల రక్తం పీలుస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చాగలమర్రి రాంపల్లి రఘునాథరెడ్డిరెడ్డి, రామోహన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డిలను అవమానించి పార్టీని వీడేలా చేశారని ఆరోపించారు.  

ఆళ్లగడ్డ, దొర్నిపాడు మండలాల్లోపూ పలువురు కీలక నేతలు పార్టీని వీడారని విమర్శించారు. శివరామిరెడ్డి క్రషర్‌ను లాక్కోవాలని చూస్తే దూరమయ్యారని అన్నారు. భార్గవ్,అఖిలలు పార్టీ కార్యకర్తలను అమానిస్తున్నారనీ, వారిని పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయేలా చేస్తున్నారని  విమర్శించారు. ఆళ్లగడ్డలో ‘భూమా’ వర్గం అంటూ ఏదీ లేదని, ఆ వర్గం ఎప్పుడో  బలహీనపడిందని అన్నారు. అయితే ఇదే సమయంలో భూమా వర్గానికి అండగా ఉంటానని చెప్పడం మరో  గమనార్హం. ఏదిఏమైనా.. టీడీపీకి ఇలాంటి ఇంటిపోరు, వర్గపోరులు చాలా నష్టపరుస్తాయి. 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!