నెల్లూరు జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థిని అనుమానస్పద స్థితిలో మృతి.. పక్కనే 5 నెలల పిండం..!

Published : Apr 15, 2023, 03:42 PM IST
నెల్లూరు జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థిని అనుమానస్పద స్థితిలో మృతి.. పక్కనే 5 నెలల పిండం..!

సారాంశం

నెల్లూరు జిల్లాలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని అనుమానస్పద స్థితిలో మృతిచెందింది. అయితే గర్బస్రావం కావడంతో కాలేజ్‌ గదిలోనే విద్యార్థిని మృతిచెందినట్టుగా తెలుస్తోంది.

నెల్లూరు జిల్లాలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని అనుమానస్పద స్థితిలో మృతిచెందింది. అయితే గర్బస్రావం కావడంతో కాలేజ్‌ గదిలోనే విద్యార్థిని మృతిచెందినట్టుగా తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మర్రిపాడు మండలానికి చెందిన బాధిత విద్యార్థిని ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతుంది. అయితే విద్యార్థిని అనంతసాగరానికి చెందిన కారు డ్రైవర్ శశితో ప్రేమలో ఉన్నట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే విద్యార్థిని గర్భం దాల్చింది. 

అయితే ఐదు నెలల గర్భవతిగా  ఉన్న విద్యార్థిని.. కాలేజ్‌లో ఓ గదిలో రక్తపు మడుగులో పడి కనిపించింది. విద్యార్థిని అపస్మారక స్థితిలో పడి ఉండగా.. ఆమె పక్కనే ఐదు నెలల పిండం పడి ఉంది. అయితే ఇది గమనించిన తోటి విద్యార్థినులు, సిబ్బంది ఆమెను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రేవీకరించారు. 

అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే విద్యార్థిని గర్బస్రావం మాత్రలు మింగడంతోనే ఇలా జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి కారు డ్రైవర్ శశిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా సమాచారం.   

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!