అవి కరోనా లక్షణాలు కాదు.. ధూళిపాళ్ల ఆరోగ్యంపై జైలు సూరింటెండెంట్ వివరణ..

Published : May 04, 2021, 04:36 PM IST
అవి కరోనా లక్షణాలు కాదు.. ధూళిపాళ్ల ఆరోగ్యంపై  జైలు సూరింటెండెంట్ వివరణ..

సారాంశం

తెలుగు దేశం మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా లక్షణాలు లేవు. ముందస్తు జాగ్రత్తగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని రాజమండ్రి సెంట్రల్ జైలు సూరింటెండెంట్ రాజారావు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నరేంద్రకు కరోనా పరీక్షలు నిర్వహించి కాకినాడ ల్యాబరేటరీకి పంపించినట్లు తెలిపారు.

ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాకినాడ ల్యాబ్ నుంచి ఫలితాలు వచ్చిన తర్వాత చికిత్సపై తదుపరి చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ రాజారావు పేర్కొన్నారు. ధూళిపాళ్ల నరేంద్ర ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. 

టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోగ్యం సరిగాలేదంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ధూళిపాళ్ల జ్వరంతో బాధపడుతున్నట్లు న్యాయవాది పిటిషన్లో పేర్కొన్నారు. 

సంగం డెయిరీ కేసులో అరెస్టు: ధూళిపాళ్ల నరేంద్రకు అస్వస్థత..!...

ప్రైవేట్ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందించేందుకు అనుమతించాలని ధూళిపాళ్ల తరఫు న్యాయవాది కోర్టును కోరారు. కాగా కౌంటర్ దాఖలు చేసేందకు ఏసీబీ పీపీ సమయం కోరినట్లు తెలుస్తోంది. గత రాత్రి నుంచి జ్వరం, దగ్గుతో బాధపడుతున్న ధూళిపాళ్ల నరేంద్రను జైలు అధికారులు కోవిడ్ పరీక్షల కోసం రాజమండ్రి సెంట్రల్ జైలునుంచి ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. 

కాగా, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అస్వస్థతకు గురయ్యాడు. సోమవారం రాత్రి నుంచి నరేంద్ర జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ధూళిపాళ్ల నరేంద్ర 
రాజమండ్రి సెంట్రల్ జైల్‍లో ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్