ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ: కర్ఫ్యూకి ఆమోదముద్ర... కీలక నిర్ణయాలు

By Siva KodatiFirst Published May 4, 2021, 3:37 PM IST
Highlights

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రి మండలి సమావేశం ముగిసింది. రేపటి నుంచి రాష్ట్రంలో పాక్షిక కర్ఫ్యూకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రి మండలి సమావేశం ముగిసింది. రేపటి నుంచి రాష్ట్రంలో పాక్షిక కర్ఫ్యూకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ, ప్రవేట్ కార్యాలయాలు, పరిశ్రమలు, ప్రజా రవాణాకు ప్రభుుత్వం అనుమతించింది.

మధ్యాహ్నం 12 తర్వాత పూర్తి స్థాయిలో కర్ఫ్యూ అమలు చేయనుంది ఏపీ సర్కార్. మధ్యాహ్నం 12 తర్వాత ఆర్టీసీ బస్సులను కూడా నిలిపివేస్తామని తెలిపింది. మరోవైపు వ్యాక్సిన్ డోసుల్ని త్వరగా కేటాయించాలని ప్రధానికి లేఖ రాయనున్నారు సీఎం జగన్.

Also Read:కరోనాపై అమికస్ క్యూరీ ఏర్పాటు: జగన్ సర్కార్‌కి హైకోర్టు ఆదేశం

ఆక్సిజన్ సమస్య పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కర్ణాటక, ఒడిశా, తమిళనాడు నుంచి ఆక్సిజన్ తెప్పించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం కోరారు.

ప్రస్తుతం ఏపీలో 450 మిలియన్ టన్నుల ఆక్సిజన్ డిమాండ్ వుంది. సింగపూర్ నుంచి 20 ఆక్సిజన్ ట్యాంకర్ల కొనుగోలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి మండలి నిర్ణయించింది. 
 

click me!