త్వరలోనే రాజమండ్రిలో ధర్మపోరాట దీక్ష సభ, యూనివర్శిటీల్లో సభలు: కాలువ

First Published Jun 12, 2018, 3:31 PM IST
Highlights

రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి సభలు


 అమరావతి: మూడో ధర్మపోరాట దీక్షను రాజమండ్రిలో ఏర్పాటు చేయాలని టిడిపి నిర్ణయం తీసుకొంది. ఆ తర్వాతి సభను రాయలసీమలో నిర్వహించాలని భావిస్తున్నట్టు ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కాలువ శ్రీనివాసలు ప్రకటించారు. 


టిడిపి సమన్వయ కమిటి సమావేశంలో తీసుకొన్ననిర్ణయాలను ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి  కాలువ శ్రీనివాసులు మంగళవారం నాడు అమరావతిలో మీడియాకు వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్టు చెప్పారు.

ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశాలున్నాయని  గతంలోనే తమ పార్టీ ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇవాళ జరిగిన సమావేశంలో కూడ ఇదే రకమైన చర్చ జరిగిందన్నారు. ఇటీవల కాలంలో ఈవీఎంల ట్యాంపరింగ్ పై అనుమానాలు వ్యక్తమౌతున్న తరుణంలో ఈ అంశంపై చర్చ జరిగిందన్నారు. అయితే జాతీయ స్థాయిలో ఈ విషయమై ఏం చేయాలనే దానిపై పార్టీ నాయకత్వం చర్చిస్తోందన్నారు.

రాష్ట్రంలో విపక్షాలు కూటమిగా ఏర్పడి దిగజారుడు రాజకీయాలకు పాల్పడినట్టు ఆయన ఆరోపించారు.ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టేందుకు కూడ ప్రయత్నిస్తున్నాయని ఆయ ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. యూనివర్శిటీల వారీగా కూడ సభలను నిర్వహించాలని నిర్ణయించినట్టు మంత్రి కాలువ శ్రీనివాసులు చెప్పారు.ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం ఏ రకంగా మోసం చేసిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నామని ఆయన చెప్పారు.


ఈ నెల 22వ తేదిన దళిత తేజం ముగింపు సభను నెల్లూరులో నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు. గిరిజన, బీసీల చైతన్య సభలను కూడ నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నామని ఆయన చెప్పారు. ప్రతి అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకర్గాల వారీగా పార్టీ ముఖ్య నేతలను ఎంపిక చేసి మూడు రోజుల పాటు శిక్షణ తరగతులు ఇవ్వాలని  ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.

click me!