ఒంటిమిట్ట : సీత‌మ్మ‌కు రూ.1.85 లక్షల విలువైన బంగారు హారం బ‌హూక‌ర‌ణ‌

Siva Kodati |  
Published : Aug 25, 2021, 08:32 PM IST
ఒంటిమిట్ట : సీత‌మ్మ‌కు రూ.1.85 లక్షల విలువైన బంగారు హారం బ‌హూక‌ర‌ణ‌

సారాంశం

క‌డ‌ప జిల్లా ఒంటిమిట్ట ప‌ట్ట‌ణంలో కొలువై ఉన్న శ్రీ కోదండ‌రామస్వామి ఆల‌యంలోని సీత‌మ్మ‌వారికి ఓ భ‌క్తుడు రూ.1.85 ల‌క్ష‌ల విలువ గ‌ల 38.042 గ్రాముల బంగారు హారాన్ని బ‌హూక‌రించాడు

క‌డ‌ప జిల్లా రాజంపేట తాలుకా ఒంటిమిట్ట ప‌ట్ట‌ణంలో కొలువై ఉన్న శ్రీ కోదండ‌రామస్వామి ఆల‌యంలోని సీత‌మ్మ‌వారికి ఓ భ‌క్తుడు బంగారు హారాన్ని బ‌హూక‌రించాడు. క‌ర్నూల్‌కు చెందిన సి.పుల్లారెడ్డి బుధ‌వారం ఉద‌యం రూ.1.85 ల‌క్ష‌ల విలువ గ‌ల 38.042 గ్రాముల బంగారు హారాన్ని అమ్మ‌వారికి కానుక‌గా స‌మ‌ర్పించాడు. ఈ సందర్భంగా ఆల‌య‌ ఏఈవో ముర‌ళీధ‌ర్‌కు ఆయన హారాన్ని అంద‌జేశారు. అనంత‌రం వేద పండితులు హారానికి పూజ‌లు నిర్వ‌హించి, అమ్మ‌వారికి అలంక‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆలయన సూప‌రింటెండెంట్ వెంక‌టేష్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ గిరి, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు