జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలి: వైఎస్ వివేకా కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్టి పిటిషన్

By narsimha lode  |  First Published Jun 1, 2022, 4:42 PM IST

జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కడప జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై బుధవారం నాడు కడప జిల్లా కోర్టులో విచారణ జరిగింది. శివశంకర్ రెడ్డికి ప్రత్యేక వసతులు అవసరం లేదని సీబీఐ తెలిపింది. 
 



కడప: జైల్లో తనకు ప్రత్యేక వసతులు కల్పించాలని Devireddy Sivasankar Reddy కడప జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై బుధవారం నాడు Kadapa జిల్లా కోర్టులో విచారణ జరిగింది.

మాజీ మంత్రి YS Vivekanada Reddy కేసులో CBI  దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. అయితే జైల్లో తనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని  పిటిషన్ వేశాడు. అయితే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి జైల్లో ప్రత్యేక వసతులు అవసరం లేదని సీబీఐ తరపు న్యాయవాది తన వాదనలను విన్పించారు. ఈ విషయమై విచారణను ఈ నెల 7వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

Latest Videos

undefined

also read:వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్ట్: వైఎస్ సునీత సహా మరో ఇద్దరిపై ప్రైవేట్ కేసు

2021 నవంబర్ 17న హైద్రాబాద్ లో ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన వద్ద డ్రైవర్ గా పనిచేసిన దస్తగిరి  సీబీఐకి అఫ్రూవర్ గా మారి కీలక సమాచారాన్ని ఇచ్చాడు. ఈ వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పించారు.2019 మార్చి 14న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఆయన ఇంట్లోనే దుండగులు హత్య చేశారు. ఈ హత్యకు ఆర్ధిక లావాదేవీలే కారణమని దస్తగిరి  సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.  ఈ వాంగ్మూలం ఆధారంగా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు 

2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ హత్య చోటు చేసుకొంది.ఈ హత్య సమయంలో టీడీపీ అధికారంలో ఉంది. చంద్రబాబునాయుడు ఈ హత్యపై విచారణకు సిట్ ను ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన  వైసీపీ సర్కార్ కూడా సిట్ దర్యాప్తును ఏర్పాటు చేసింది. ఏపీ సీఎం వైఎస్ ys jaganజగన్ బాబాయ్, మాజీ మంత్రి ys vivekanada reddy murder case పై సీబీఐ  వంద రోజులుగా విరామం లేకుండా విచారణ చేస్తోంది.ఈ విచారణలో కీలక విషయాలను సీబీఐ సేకరించింది. వివేకానందరెడ్డి వద్ద డ్రైవర్ గా పనిచేసిన దస్తగిరి కీలక సమాచారాన్ని సీబీఐకి ఇచ్చాడు.

వివేకానందరెడ్డి హత్యపై 2021 ఆగస్ట్ 30న దస్తగిరి  స్టేట్‌మెంట్ ఇచ్చారు. దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌ను మిగతా నిందితుల లాయర్లకు కోర్టు ఇచ్చింది. కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో దస్తగిరి బడా నేతల పేర్లు ప్రస్తావించారు. సీఆర్‌పీసీ 164(1) సెక్షన్ కింద ప్రొద్దుటూరు కోర్టులో స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. హత్యలో నలుగురు పాల్గొన్నట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో ఉంది. 

ఎర్ర గంగిరెడ్డి  , సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. వివేకా హత్యకు ఎర్ర గంగిరెడ్డి కుట్రపన్నినట్లు దస్తగిరి పేర్కొన్నారు. బెంగళూరు ల్యాండ్ వివాదంలో వాటా ఇవ్వకపోవడంపై ఆగ్రహంతో ఎర్ర గంగిరెడ్డి పగ పెంచుకున్నారని చెప్పారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను తేల్చాలని కోరుతూ వివేకానందరెడ్డి కూతురు సునీతా రెడ్డి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవీంద్రలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో వాస్తవాలు వెలుగు చూడాలంటే సీబీఐ విచారణ అవసరమని వారు ఆ పిటిషన్లలో కోరారు. దీంతో ఏపీ హైకోర్టు వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించింది.
 

click me!