ప్రగతిభవన్లో బిర్యానీ పెట్టి కేసీఆర్ కోరారు... జగన్ చేశారు: పోలవరంపై దేవినేని ఉమ సంచలనం

By Arun Kumar PFirst Published Jul 8, 2021, 2:37 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సంచలన  వ్యాఖ్యలు చేశారు. 5 కోట్ల ప్రజల ఆస్తులని ఎవరికీ చెప్పకుండా జగన్ తెలంగాణకు ఇచ్చేసాడని ఆరోపించారు. 

విజయవాడ: నేడు రైతు దినోత్సవం కాదు రైతు దగా దినోత్సవమని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వర రావు మండిపడ్డారు. గురువారం విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి గ్రామంలో రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. 

ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ... ''నారుమళ్లకు నీళ్లు ఇచ్చే సమయంలో మీరు ఏ విధంగా సముద్రంలో కి నీళ్లు వదులుతారు? దగ్గర దగ్గర 2 ప్రకాశం బ్యారేజీలో పట్టేంత నీళ్లు సముద్రంలో పాలు చేశారు. ప్రగతి భవన్ లో బిర్యానీ తినేటప్పుడు తెలంగాణలో ఏపీ ప్రజలు గుర్తుకు రాలేదా? ఆ రోజు ఏమి మాట్లాడారు.. మా మధ్య భేషజాలు లేవు అన్నారు మరీ ఇవాళ మీ భేషజాలు ఏమైయ్యాయి?'' అని జగన్ ను ప్రశ్నించారు. 

''తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ బకాయిలు చెల్లించాలి... అడిగావా? విద్యుత్ ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి... అడిగావా? అయినా ఈ సమస్యల గురించి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడికి ఏం తెలుస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ ను ఒక మీటర్ తగ్గించుకోమని కేసీఆర్ చెబితే ఈయన 5మీటర్లు తగ్గించాడు'' అని దేవినేని ఉమ ఆరోపించారు. 

read more  కమీషన్ల కోసం కన్నతల్లిని కూడా అమ్ముకునే రకం: జగన్ పై అచ్చెన్న సంచలనం

''ఆరుగాలం కష్టపడి పెళ్ళాం పుస్తెలు తాకట్టు పెట్టి పంటలు సాగు చేసే రైతు బాధలు ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా?. రైతును గాలికి వదిలేసి మిల్లర్ల దయా దక్షిణ్యాలు మీద బ్రతికేలా చేస్తున్నారు. రైతుల డబ్బులు తీసుకెళ్లి రైతు భరోసా కాంట్రాక్టర్లుకు  ఇచ్చారంటే ఇది ఎంత దౌర్భాగ్యమైన ప్రభుత్వమో అర్ధమవుతుంది'' అని మండిపడ్డారు. 

''ఇది రైతు దగా ప్రభుత్వం. ధాన్యం డబ్బులు ఎప్పుడు ఇస్తాడో తెలియదు. రైతుకు పెట్టుబడి కింద 3 లక్షలు ఇచ్చేవాళ్ళము. ఇవాళ లక్షకు తీసుకువచ్చావు. గతంలో ఆన్ లైన్లో ధాన్యం డబ్బులు ఎంత రావాలి అని తెలుసుకునే సమాచారం ఉండేది... అది మూసేసారు'' అన్నారు. 

''ఈ బూతులు మంత్రి ఏం చేస్తున్నాడు. వ్యవసాయ శాఖ మంత్రి అసలు నోరు తెరవడం లేదు. వీళ్లకు చేతనైనది ఏమిటి అంటే.. చంద్రబాబుని, లోకేష్ ని తిట్టడం తప్ప ఏమీ తెలియదు'' అని ఎద్దేవా చేశారు. 

''13 జిల్లాలలో ఏ రైతుకు ఎంత డబ్బు వేసింది సమాచారం దాచుకుంటున్నావు... ఇదేమైనా దేవ రహస్యమా? తాడేపల్లి రాజ ప్రాసాదంలో కూర్చొని పబ్జి ఆడుకుంటూ కృష్ణా నీళ్లు నికర జలాలు సముద్రం పాలు చేస్తున్నావు జగన్ రెడ్డి. అఖిలపక్షం పెట్టి నలుగురితో మాట్లాడమని చంద్రబాబు సూచించినా వినలేదు. 5 కోట్ల ప్రజల ఆస్తుని ఎవరికీ చెప్పకుండా తెలంగాణకు ఇచ్చేసాడు'' అని ఉమ ఆరోపించారు. 

 

click me!