షర్మిల పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు.. సజ్జల

By telugu news teamFirst Published Jul 8, 2021, 2:02 PM IST
Highlights

షర్మిల పార్టీ పెడతానని గతంలోనే చెప్పారని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు లేకుండా ఉండాలనే అక్కడ పార్టీ విస్తరించలేదని సజ్జల పేర్కొన్నారు.

వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడంపై రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా తాడేపల్లిలో  వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సజ్జల పాల్గొని.. వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సజ్జల షర్మిల కొత్త పార్టీపై మాట్లాడారు. షర్మిల పార్టీ పెడతానని గతంలోనే చెప్పారని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు లేకుండా ఉండాలనే అక్కడ పార్టీ విస్తరించలేదని సజ్జల పేర్కొన్నారు.

 షర్మిల పార్టీ గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.  విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రెవేటికరణ వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్రం గౌరవించాలని చెప్పారు. .ప్రెవేటికరణ వ్యతిరేకంగా ప్రభుత్వం చేయాల్సింది అంతా చేస్తామని అన్నారు.

ఇదిలా ఉండగా.. వైఎస్ జయంతి సందర్భంగా ఆయన చేసిన మంచిని సజ్జల ప్రజలకు వివరించారు. మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి  ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారన్నారు. తొలి నుంచి వైఎస్‌ఆర్‌తో  తాము అడుగులు వేసామని చెప్పారు.  వైఎస్సార్ జయంతి, వర్ధంతి వేడుకలను నిర్వహించుకోవటం ద్వారా వైఎస్ ఆశయాలను పునశ్చరించుకుని పునరంకితం  అవుతామన్నారు. వైఎస్‌కు పచ్చదనం అంటే చాలా ఇష్టమని..అందుకే ఈసారి మొక్కలు నాటడం కూడా చేస్తున్నామన్నారు. 

click me!