సీఎం జగన్ కు కోర్టులంటే లెక్కేలేదు... అందుకే ఈ పరిస్థితి: దేవినేని ఉమ సీరియస్

By Arun Kumar PFirst Published Jul 13, 2021, 12:43 PM IST
Highlights

ఉపాధి హామీ బకాయిలు రూ.2500 కోట్లను వెంటనే చెల్లించాలంటూ కృష్ణా జిల్లా కలెక్టర్ జె నివాస్ ను టీడీపీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దేేవినేని ఉమ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

విజయవాడ: మహాత్మాగాంధీ ఉపాధిహామీ పధకం అంటే సీఎం జగన్మోహన్ రెడ్డికి లెక్కే లేదని మాజీమంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. హైకోర్టు అన్నా సీఎంకు లెక్కలేదన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వంలా తయారైందని... ఏపీలో చట్టబద్ద పరిపాలన సాగడంలేదని ఆరోపించారు. 

ఉపాధి హామీ బకాయిలు రూ.2500 కోట్లను వెంటనే చెల్లించాలంటూ కృష్ణా జిల్లా కలెక్టర్ జె నివాస్ ను టీడీపీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ... టీడీపీ సానుభూతిపరులు, సర్పంచులు అప్పట్లో అభివృద్ధి పనులు చేసారన్నారు. ప్రస్తుతం జగన్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గాలకు పాల్పడుతోందన్నారు. న్యాయస్ధానాలకు సీఎం జగన్ ఇప్పటికైనా నిజాలు చెప్పాలి అన్నారు దేవినేని ఉమ. 

read more  దాంట్లో రూ.4500కోట్ల అవినీతి... ఆ మంత్రులు, ఎమ్మెల్యేలపై సిబిఐ విచారణ: బుద్దా వెంకన్న డిమాండ్

మాజీమంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ... జగన్ ప్రభుత్వం వచ్చాక ఉపాధిహామీ బిల్లులు పెండింగ్ పెట్టారని ఆరోపించారు. సర్పంచ్ లు పేదవారుగా ఉన్నా కూడా అభివృద్ధి పనులు చేసారని... కానీ చేసిన అప్పులు తీర్చలేక 50 మంది చనిపోయారని తెలిపారు. 1470 కోట్లు కేంద్రం ఇస్తే 375 కోట్లు ఆర్బీఐ ఓవర్ డ్రాఫ్ట్ కింద జమ కట్టుకుందన్నారు. మాజీ సర్పంచ్ లు, కార్మికులకు నిధులు ఇప్పించే వరకూ పోరాడతామని రవీంద్ర స్పష్టం చేశారు.

మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ మాట్లాడుతూ... 2018-19 ఉపాధి హామీ బకాయిలు విజిలెన్స్ తనిఖీల పేరిట పెండింగ్ పెట్టారని మండిపడ్డారు. ఉపాధి హామీ బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటోందన్నారు. హైకోర్టు ఉపాధి హామీ నిధులు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసినా జగన్ ప్రభుత్వ పట్టించుకోవడం లేదన్నారు కొనకళ్ల. 

click me!