చంద్రబాబు, లోకేష్ లతో పాటు వారి ఇంట్లోని మహిళలపై అసభ్యకరంగా, అవమానకరంగా మాట్లాడుతున్న కొడాలి నానికి అంకుశం సినిమాలో విలన్ రామిరెడ్డికి పట్టిన గతే పడుతుందని దేవినేని ఉమ హెచ్చరించారు.
విజయవాడ : మాజీ మంత్రి కొడాలి నానిపై టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుడివాడ గుట్కా, సన్నబియ్యం సన్నాసి నాని గతంలో చంద్రబాబు బూట్లు నాకాడని అన్నారు. రాజకీయ అవకాశాలిచ్చిన నాయకుడి కుటుంబాన్నే ఇప్పుడు ఈ దరిద్రుడు నోటికొచ్చినట్లు తిడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసారు. వీడు చంద్రబాబు ఇంట్లోని మహిళలు భువనేశ్వరి, బ్రాహ్మణి గురించి కూడా నీచంగా మాట్లాడుతున్నాడని... వాడు పశువులా ప్రవర్తిస్తున్నాడని అన్నారు. అంకుశం సినిమాలో రామిరెడ్డికి పట్టిన గతే వీడికి పడుతుందంటూ కొడాలి నానిపై దేవినేని ఉమ విరుచుకుపడ్డారు.
చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా టిడిపి నాయకులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమంలో దేవినేని ఉమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పట్టిసీమ కట్టిన వ్యక్తి జైల్లో వుంటే నాశనం చేసినోడు మాత్రం గద్దెమీద ఉన్నాడన్నారు. అంటే మంచిపై చెడు గెలిచినట్లు కనిపిస్తోంది... చివరకు గెలిచేది మంచే అని దేవినేని ఉమ అన్నారు.
వీడియో
చంద్రబాబు అరెస్టుతో టిడిపి పార్టీ క్యాడర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలన్న వైసీపీ కుట్ర చేసిందని ఉమ అన్నారు. లోకేష్ ను కూడా అరెస్ట్ చేయాలని చూస్తోందన్నారు. ఇలా అక్రమ అరెస్టులతో తెలివితక్కువ ప్రబుద్లులు ఎన్నికుట్రలు పన్నినా టిడిపిని ఏం చేయలేరని అన్నారు. ఈ దుర్మార్గ ముఖ్యమంత్రికి అధికారం, ధనబలం అన్నీ తోడవడంతో మరింత అరాచకాలకు పాల్పడుతున్నాడని దేవినేని ఉమ ఆందోళన వ్యక్తం చేసారు.
Read More చంద్రబాబును జైల్లో పెట్టడం మాకూ బాధగానే వుంది..: మంత్రి అంబటి ఆసక్తికర వ్యాఖ్యలు (వీడియో)
సీఎం జగన్ కు ఓటమి భయం పట్టుకుందని ఆయన మాటలను బట్టి అర్థమవుతుందని అన్నారు. ఇటీవల పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశంలో జగన్ ఫస్ట్ గేర్ లో వున్నామని... ఇలాగయితే వందమంది సిట్టింగ్ లను మార్చాల్సి వస్తుందని అన్నాడని గుర్తుచేసారు. ఈ మాటలతో ఆయన ఓటమిని ఒప్పుకున్నట్లేనని అన్నారు. తొండాట ఆడుతున్న జగన్ రాబోయే ఎన్నికల్లో ఓడిపోక తప్పదని అన్నారు.
గతంలో చంద్రబాబు ఇంటిపైకే దాడికి వెళ్లి తిరిగి ఆయనపైనే 307, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారని... ఈ కేసులోనూ బెయిల్ రద్దుకు సైకో జగన్ సుప్రీంకోర్టుకు వెళ్లారని అన్నారు. ఇలా చంద్రబాబును అనేక కేసుల్లో ఇరికించి ఎక్కువకాలం జైల్లో వుంచి జగన్ రాక్షసానందం పొందతున్నాడని అన్నారు. కోడికత్తితో పొడిపించుకుని జగన్ సానుభూతితో ముఖ్యమంత్రి అయ్యాడు... పొడిపించిన బొత్స మంత్రి అయ్యాడని అన్నారు. ఇలా అనేక కుట్రలతో అధికారంలోకి వచ్చిన జగన్ పాలనను గాలికొదిలి ప్రతిపక్షాలపై కక్షసాధింపే పనిగా పెట్టుకున్నాడని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు.