బ్రతికున్నంత వరకు ప్రశ్నిస్తూనే ఉంటా.. దేవినేని ఉమా

By AN TeluguFirst Published Apr 29, 2021, 12:20 PM IST
Highlights

మాజీమంత్రి దేవినేని ఉమా గుంటూరు జిల్లా, మంగళగిరి సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..హై కోర్టు ఆదేశాలను గౌరవించి మంగళగిరి సీబీఐ ఆఫీస్ కి వచ్చానన్నారు. 

మాజీమంత్రి దేవినేని ఉమా గుంటూరు జిల్లా, మంగళగిరి సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..హై కోర్టు ఆదేశాలను గౌరవించి మంగళగిరి సీబీఐ ఆఫీస్ కి వచ్చానన్నారు. 

కరోనా విలయతాండవం చేస్తుంది. ప్రజలు ఫోన్ లు చేసి ఒక్క బెడ్ ఇప్పించండి అని ప్రాధ్యాపడుతున్నారు. బందరు లో మంత్రి చాలా పెద్డ పెద్డ కబుర్లు చెప్పాడు..అధికారులు, పోలీసులు కేసులంటూ తిరుగుతున్నారు. ప్రజలను పట్టించుకునే వాళ్ళు లేరని మండిపడ్డారు. 

ముఖ్యమంత్రి కి కరోనా భయం.. రెండు గంటలు క్యాబినెట్ మీటింగ్ లో కూర్చుంటే కరోనా వస్తుందేమో అని భయం.. మీకే అలా ఉంటే విద్యార్థుల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. 

కేంద్ర సంస్థల కంటే నువ్వు ఏమైనా తెలివిగలవాడివా? ధూళిపాళ నరేంద్ర చేసిన తప్పేమిటండీ? అని విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి గుజరాత్ అమూల్ కి పాలు పోయించాలని తాపత్రయ పడుతున్నాడు.. అందుకే ఈ అరెస్టు అని ఎద్దేవా చేశారు.

దొంగల పేరుతో నోటీసులు ఇస్తారా..? డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్  ఇచ్చిన స్వేచ్ఛ భావన ప్రకటన హక్కు కు ఏ మాత్రం గౌరవం లేదా.. చట్టాలను చుట్టలుగా చేసుకొని పరిపాలన చేస్తున్నారు అంటూ ధ్వజమెత్తారు.

ఆస్పత్రుల్లో ఒకే బెడ్ మీద ఇద్దరు ముగ్గురు పడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ని నేను ఒక్కటే అడుగుతున్నా.. కరోనా హాస్పిటల్ ను సందర్శించే దమ్ము ఉందా ? అని ఛాలెంజ్ విసిరారు. 

ప్రజలంతా తమ కుటుంబాన్ని కాపాడుకోడానికి ఏ విధంగా తాపత్రయ పడుతున్నారో చూడండి.. ఆక్సిజన్ ఇచ్చే దిక్కు కూడా లేదు. కరోనా ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి దాదాపు మూడు నెలల సమయం ఉంటే ఏం చేశారు? మమ్మల్ని కేసులు పెట్టి పోలీసు స్టేషన్ చుట్టు తిప్పి ఒక పైశాచిక  ఆనందం పొందుతున్నావు అంటూ విరుచుకుపడ్డారు.

ప్రజావేదికతో మొదలైన నీ విధ్వంసం  వైజాగ్ పల్లా శ్రీనివాస రావు దగ్గరకు వచ్చింది. భారత రాజ్యాంగం పట్ల నాకు సంపూర్ణ నమ్మకం ఉంది న్యాయం జరుగుతుంది అని అన్నారు. 

వ్యాక్సిన్ ఎంత మందికి చేశారు? రాష్ట్రంలో దాదాపు 12 లక్షల మందికి ఇంకా సెకండ్ వ్యాక్సిన్ వేయించుకోలేదని చెప్పారు. మీరెన్ని తప్పుడు కేసులు పెట్టినా దేవినేని ఉమా  బ్రతికునంత వరకు ప్రశ్నిస్తూనే ఉంటాడని చెప్పుకొచ్చారు. 
 

click me!