
విజయవాడ : అడవిలో చాలా జంతువులు ఉంటాయి.. కానీ ఒక్క సింహమే రాజు... ఇలాగే ఏపీ రాజకీయాల్లో ఎంతమంది నాయకులున్నా జగన్ మాత్రమే సింహం అని వైసిపి నాయకులు దేవినేని అవినాష్ అన్నారు. నక్కలు గుంపులుగా వచ్చినా జగన్ సింగిల్ గానే ఎన్నికలకు వెళతారని... సింహంలా పోరాడి ఆయనే మళ్లీ సీఎం అవుతారని అన్నారు. ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి ల తర్వాత రాష్ట్రంలో సంక్షేమానికి టార్చ్ బేరర్ గా జగన్ నిలిచారని అవినాష్ కొనియాడారు.
40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే సరిపోదు... ఏనాడైనా సురక్ష లాంటి కార్యక్రమం చేయాలని ఆలోచని వచ్చిందా? అని మాజీ సీఎం చంద్రబాబును అవినాష్ ప్రశ్నించారు. టిడిపి నేతలు స్థాయిని మరిచి సీఎం జగన్ గురించి మాట్లాడుతున్నారని... వారికి ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు. జగన్ సుపరిపాలనలో తాము సంతోషంగా వున్నామని ప్రజలే చెబుతున్నారని అవినాష్ అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని బీహార్, శ్రీలంకతో పోల్చడం టిడిపి నాయకులు ఆపాలని... వాస్తవాలు తెలుసుకుని నిజాలు మాట్లాడాలని అవినాష్ సూచించారు. టిడిపి ప్రభుత్వ హయాంలో కులం, పార్టీ అర్హతలుగా పనులు జరిగితే వైసిపి పాలనలో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనులు జరుగుతున్నాయని అన్నారు. కేవలం వైసిపి ప్రజాప్రతినిధుల ఉన్నచోటే కాదు టిడిపి గెలిచిన చోట కూడా అభివృద్ది పనులు జరుగుతున్నాయని అన్నారు. విజయవాడలో చూసుకుంటే టిడిపి కార్పొరేటర్ల డివిజన్లలో కూడా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని అవినాష్ తెలిపారు.
Read More అమరావతి ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే: సుప్రీంలో సవాల్ చేయనున్న జగన్ సర్కార్
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పాదయాత్రపై అవినాష్ సెటైర్లు వేసారు. లోకేష్ యువగళం పాదయాత్రకు జనాలు రావడంలేదు... టిడిపి నాయకులే తరలిస్తున్నారని అన్నారు. లోకేష్ పాదయాత్ర అట్టర్ ప్లాప్ అయ్యిందని అవినాష్ పేర్కొన్నారు.
జగనన్న సురక్ష వల్ల రాష్ట్రంలోని 1.39 కోట్ల కుటుంబాలకు అన్ని సేవలు అందాయని అవినాష్ తెలిపారు. ఇంటింటికి సర్వే చేసి ఏ ప్రభుత్వం చేయని విధంగా 84 లక్షల కుటుంబాలకు సర్టిఫికేట్లు ఇచ్చామన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోనూ 92శాతం కుటుంబాలకు సర్టిఫికేట్లు ఇచ్చామని దేవినేని అవినాష్ వెల్లడించారు.