అమరావతి ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే: సుప్రీంలో సవాల్ చేయనున్న జగన్ సర్కార్

By narsimha lode  |  First Published Aug 3, 2023, 2:12 PM IST

ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై  ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేయాలని జగన్ సర్కార్ భావిస్తుంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. 


అమరావతి:ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై  ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై  సుప్రీంకోర్టులో  ఏపీ ప్రభుత్వం  సవాల్ చేయనుంది.  ఆర్-5 జోన్ ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేయాలని  ఏపీ హైకోర్టు  గురువారంనాడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.ఈ ఉత్తర్వులను  సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని  జగన్ సర్కార్ భావిస్తుంది. 

అమరావతిలో ఆర్-5 జోన్ లో ఇతర ప్రాంతాలకు  చెందిన  పేదలకు  ఇళ్లు నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలోని 53,216 మంది పేదలకు  ఆర్-5 జోన్ లో  ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇళ్ల స్థలాలతో పాటు  ఇళ్లను నిర్మించేందుకు  ప్రభుత్వం ఏర్పాట్లు  చేసింది.ఈ మేరకు ఈ ఏడాది జూలై  24న  సీఎం జగన్  ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన  చేశారు.

Latest Videos

undefined

ఆర్-5 జోన్ లో ఇతర ప్రాంతాలకు చెందిన  47, 107 మందికి  ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లను కట్టి ఇవ్వనున్నారు.అమరావతిలోని  ఆర్-5 జోన్ లో  మంగళగిరి, తాడేపల్లి, పెద్దకాకాని,విజయవాడ, దుగ్గిరాల, గుంటూరు మండలాల్లోని పేదలకు  ఇళ్ల పట్టాలివ్వాలని  ప్రభుత్వం  నిర్ణయం తీసుకుంది.   ఈ జోన్ లో  47, 516 ఇళ్లను నిర్మించాలని  ప్రభుత్వం  నిర్ణయించింది.అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా టీడీపీ సహా  ఇతర విపక్షాలు అడ్డుపడుతున్నాయిన  వైఎస్ఆర్‌సీపీ సర్కార్ ప్రచారం చేసింది.  ఈ ప్రచారంపై  విపక్షాలు కూడ జగన్ సర్కార్ పై కౌంటర్ కు ప్రయత్నాలు చేస్తున్నాయి

 

also read:జగన్ సర్కార్ కు షాక్: ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే

ఆర్-5 జోన్ లో  ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు కట్టించి ఇవ్వడాన్ని  అమరావతి రైతులు వ్యతిరేకించారు.ఈ విషయమై  హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  ఇళ్ల స్థలాల  పంపిణీకి సుప్రీంకోర్టు అనుమతిని ఇచ్చింది. అయితే  హైకోర్టు తుది తీర్పునకు లోబడే.... తుది తీర్పు తర్వాత  చర్యలు తీసుకోవాలని  సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.సుప్రీంకోర్టు  ఆదేశాల్లోని ఈ నిబంధనను  రైతుల తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత  తీర్పును  ఈ ఏడాది జూలై  21న రిజర్వ్ చేసింది.ఈ విషయమై ఇవాళ తీర్పును వెల్లడించింది. ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేయాలని  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ ఆదేశాలను  ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో  సవాల్ చేయనుంది.


 

click me!