ఏపీలో రేపటి నుంచి లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపు: మినహాయింపులు వీటికే

By Siva KodatiFirst Published Apr 19, 2020, 7:36 PM IST
Highlights

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తూ ప్రధాని నరేంద్రమోడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని రంగాలకు ఏప్రిల్ 20 నుంచి మినహాయింపులు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఆంక్షల సడలింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తూ ప్రధాని నరేంద్రమోడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని రంగాలకు ఏప్రిల్ 20 నుంచి మినహాయింపులు ఇవ్వాలని కోరారు.

Also Read:విజృంభిస్తున్న కరోనా: ఇకపై గ్యాస్ నో డోర్ డెలివరీ.. మరి ఎలాగంటే..?

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఆంక్షల సడలింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. లాక్‌డౌన్‌ మినహాయింపులో భాగంగా కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యకలాపాలపై ఆంక్షలను సడలిస్తూ పాటించాల్సిన నిబంధనలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.

Aslo Read:కరోనా: ఇండియాలో 24 గంటల్లో 1,334 కేసులు, మొత్తం 15,712కి చేరిక

దీని ప్రకారం.. కేంద్ర హోంశాఖ, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నిబంధనలను అనుసరించి మినహాయింపులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పరిశ్రమల శాఖ అధికారులు, రవాణా, కార్మిక శాఖ అధికారులకు ప్రభుత్వం పంపింది. 

మినహాయింపులు వర్తించేది వీటికే:

* ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఉన్న పరిశ్రమలు, రైస్, పప్పు మిల్లులు, పిండి మరలు, డైరీ ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలు
* ఆర్వో ప్లాంట్లు, ఆహారోత్పత్తి పరిశ్రమలు, ఔషధ తయారీ సంస్థలు, సబ్బుల తయారీ కంపెనీలు, మాస్కులు, బాడీ సూట్లు తయారీ సంస్థలు. శీతల గిడ్డంగులు, ఆగ్రో పరిశ్రమలు, బేకరీ, చాక్లెట్ల తయారీ సంస్థలు, ఐస్‌ ప్లాంట్లు, సీడ్ ప్రాసెసింగ్‌ కంపెనీలు.
* ఈ-కామర్స్‌ సంస్థలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ కార్యకలాపాలు కొనసాగింపు

అయితే రెడ్ జోన్లు, కంటైన్మెంట్ జోన్లలో ఈ ఉత్తర్వులు వర్తించవు.

click me!