ఢిల్లీ లిక్కర్ స్కాం: మాగుంట రాఘవకు మధ్యంతర బెయిల్

By narsimha lodeFirst Published Jun 7, 2023, 12:56 PM IST
Highlights

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  మాగుంట  రాఘవరెడ్డికి  మధ్యంతర బెయిల్ లభించింది. 

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో  అరెస్టైన  మాగుంట  రాఘవరెడ్డికి   బుధవారంనాడు మధ్యంతర బెయిల్ దక్కింది. తన అమ్మమ్మ  అనారోగ్యంగా  ఉన్నందున ఆమెను చూసేందుకు  బెయిల్ ఇవ్వాలని మాగుంట  రాఘవరెడ్డి  ఢిల్లీ హైకోర్టులో  ఆరువారాల బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు  చేశారు.  తన అమ్మమ్మ  అనారోగ్యంతో  ఐసీయూలో  చికిత్స పొందుతున్న విషయమై  ఆధారాలను  రాఘవ కోర్టులో ఆధారాలను  సమర్పించారు.  అయితే  మాగుంట  రాఘవకు  బెయిల్ మంజూరు చేయవద్దని దర్యాప్తు  సంస్థలు  కోర్టులో వాదించాయి.  అయితే  మాగుంట  రాఘవ అభ్యర్ధన మేరకు  ఆరు వారాలకు  బదులుగా  రెండు  వారాల పాటు  మధ్యంతర  బెయిల్ ను కోర్టు  మంజూరు  చేసింది.  

ఈ ఏడాది  ఫిబ్రవరి  10వ తేదీన  ఈడీ  అధికారులు  మాగుంట  రాఘవరెడ్డిని  అరెస్ట్  చేశారు.    ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి  తనయుడే  మాగుంట  రాఘవరెడ్డి.ఢిల్లీ లిక్కర్ స్కాంలో   ఇప్పటికే  బెయిల్ పై  ఉన్న శరత్ చంద్రారెడ్డి  అఫ్రూవర్ గా మారుతానని  ప్రకటించారు.  ఈ మేరకు  కోర్టులో  పిటిషన్ దాఖలు  చేశారు.   

ఢిల్లీ లిక్కర్ స్కాంలో   ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ  రాష్ట్రాల్లో  గతంలో   సీబీఐ, ఈడీ అధికారులు  సోదాలు  నిర్వహించారు  ఈ కేసుల్లో అరెస్టైన వారిలో  రెండు తెలుగు రాష్ట్రాలకు  చెందిన వారు   ఎక్కువగానే  ఉన్నారు.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  దక్షిణాది రాష్ట్రాలకు  చెందిన వారి పాత్ర ఉందని  దర్యాప్తు  సంస్థలు  ఆరోపిస్తున్నాయి. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  కొందరికి  ప్రయోజనం చేకూర్చినందుకు గాను   ఆప్ పార్టీకి రూ. 100  కోట్లు  ముడుపులు ముట్టాయని  సీబీఐ ఆరోఫిస్తుంది. ఈ విషయమై   కోర్టుల్లో దాఖలు  చేసిన చార్జీషీట్లలో   కూడ  సీబీఐ  ఈ అంశాలను  ప్రస్తావించింది. 

also read:అరెస్ట్ భయంతోనే కవితపేరు: అరుణ్ రామచంద్ర పిళ్లై బెయిల్ పై కోర్టులో లాయర్

ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను  సీబీఐ  ఈ ఏడాది  ఫిబ్రవరి  26న అరెస్ట్  చేసింది. మనీష్ సిసోడియా బెయిల్ కోసం  ధరఖాస్తు   చేసుకొంటే  రెండు రోజుల క్రితం  ఢిల్లీ హైకోర్టు  తిరస్కరించింది.  తన భార్య ఆరోగ్య కారణాలను చూపుతూ    మనీష్ సిసోడియా  మధ్యంతర బెయిల్ ను కోరారు.

click me!