ఫిరాయింపులు: లాభసాటి బేరమైపోయింది

First Published Oct 17, 2017, 6:32 AM IST
Highlights
  • టిడిపిలోకి ఫిరాయించినందుకు బుట్టాకు చంద్రబాబు భారీ ప్యాకేజి ఇస్తున్నారట
  • కర్నూలు ఎంపిగా టిక్కెట్టు ఇవ్వటమే కాకుండా ఎన్నికల ఖర్చు పెట్టుకుంటానని హామీ ఇచ్చారటని ప్రచారం
  •  ప్యాకేజి క్రింద. 100 కోట్లట, తక్షణ ప్రయోజనం క్రింద రూ. 70 కోట్లిచ్చొ కొన్ని కాంట్రాక్టులు ఇస్తారట
  • ఇంత భారీ ప్యాకేజి ఇచ్చి లాక్కోవాల్సినంత సీన్ బుట్టాకు ఉందా అన్నదే ప్రశ్న 

ఫిరాయింపులు..ఇపుడిదో లాభసాటి వ్యాపారమైపోయింది. ఒకపార్టీ గుర్తుపైన గెలిచి మరోపార్టీలోకి ఫిరాయించటానికి నిజానికి ప్రజాప్రతినిధులు సిగ్గుపడాలి. కానీ విచిత్రంగా దానికి పెద్ద ప్రచారమే కల్పిస్తున్నారు. ఫిరాయించటాన్ని ఓ ఘనకార్యంగా చెప్పుకుంటున్నారు. తాజాగా టిడిపిలో జరుగుతున్న ప్రహసనాన్ని చూసిన తర్వాత ప్రజాస్వామ్యవాదులు తలదించుకోవాల్సిందే. కర్నూలు ఎంపిగా వైసీపీ తరపున గెలిచిన బుట్టా రేణుక మంగళవారం ఉదయం టిడిపిలోకి ఫిరాయిస్తున్నారు.

బుట్టా ఫిరాయింపును టిడిపి ఒక పద్దతి ప్రకారం ప్రచారంలోకి తీసుకొచ్చింది. నంద్యాల ఉపఎన్నిక నుండి బుట్టా ఫిరాయింపుపై వార్తలను వండి వారుస్తూనే ఉంది టిడిపికి మద్దతుగా నిలిచే పచ్చ మీడియా. అధికార పార్టీ ప్రలోభాలకే లొంగిపోయారో లేక ఫిరాయించటం ఖాయమని తెలిసిపోయిన తర్వాత వైసీపీలో అనాధరణ వల్లో మొత్తానికి ఫిరాయింపుకు ముహూర్తం నిర్ణయమైపోయింది.

టిడిపి అధికారంలోకి వచ్చిందగ్గర నుండి ఇదే పద్దతి. ప్రభుత్వంలోకి వచ్చిన వారంలోనే అరకు ఎంపి కొత్తపల్లి గీత , నంద్యాల ఎంపి ఎస్పీవై రెడ్డి ఫిరాయించారు. తరువాత విడతల వారీగా 21 మంది ఎంఎల్ఏలను లాక్కున్నారు. ఇపుడు బుట్టా రేణుక వంతు. అదే జిల్లాకే చెందిన మరో ముగ్గురు ఎంఎల్ఏలూ ఫిరాయించటానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

నిజానికి వైసీపీ నుండి ఫిరాయింపులను ప్రోత్సహించాల్సిన అవసరం 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు ఎంత మాత్రం లేదు. అయినా ప్రోత్సహిస్తున్నారంటే కేవలం జగన్ మీదున్న కసితోనే. ఎలాగైనా సరే, రాజకీయంగా జగన్ ఎంత వీలైతే అంతా దెబ్బ కొట్టాలని డిసైడ్ అయ్యారు కాబట్టే భారీ ప్యాకేజీలు ఇచ్చి మరీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. చూద్దాం, ఇంకెతమంది ప్రజాప్రతినిధులు టిడిపిలోకి ఫిరాయిస్తారో ?

 

click me!