చిత్తూరు వర్షిత హత్యాచారం కేసు: దోషికి ఉరిశిక్ష

By Siva KodatiFirst Published Feb 24, 2020, 4:17 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా ఐదేళ్ల చిన్నారి హత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సోమవారం తుది తీర్పు వెలువరించిన జిల్లా కోర్టు దోషి రఫీకి ఉరిశిక్షను విధించింది. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా ఐదేళ్ల చిన్నారి హత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సోమవారం తుది తీర్పు వెలువరించిన జిల్లా కోర్టు దోషి రఫీకి ఉరిశిక్షను విధించింది. 

2019 నవంబర్ ఏడో తేదీన చిత్తూరు జిల్లా కురబలకోట మండలం చేనేత నగర్‌లోని ఒక కళ్యాణ మండపానికి తల్లిదండ్రులతో పెళ్లికి వెళ్లిన చిన్నారి వర్షితను అత్యాచారం చేసి హత్య చేశారు.

Also Read:ఆరేళ్ల చిన్నారి వర్షిత అత్యాచారం, హత్య కేసు: 24న తుది తీర్పు

ఆ సమయంలో చిన్నారి వర్షితపై దాడికి పాల్పడిన నిందితుడిని సీసీటీవీ  పుటేజీ ఆధారంగా పోలీసులు. మదనపల్లి మండలం బసినికొండ గ్రామానికి చెందిన లారీ క్లీనర్ మహమ్మద్ రఫీ చిన్నారి వర్షితపై అత్యాచారం చేసి హత్యచేసినట్టుగా పోలీసులు గుర్తించారు.  అదే ఏడాది నవంబర్ 16వ తేదీన నిందితుడిని పోలీసులు  అరెస్ట్ చేశారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.

మృతురాలి పోస్టు మార్టం రిపోర్టు ఆధారంగా, పోలీసులు సేకరించిన సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు పోలీసులు. హత్య జరిగిన 17 రోజుల్లోనే పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు. ఈ కేసును సవాల్‌గా తీసుకొన్న పోలీసులు.

డిసెంబర్ 30వ తేదీ నుండి  ఈ ఏడాది జనవరి మొదటి వారం వరకు 41 మంది సాక్షులను కోర్టు విచారించింది. ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు కూడ పూర్తయ్యాయి.  ఈ కేసులో తుది తీర్పును ఈ నెల 17వ తేదీన ఇవ్వాల్సి ఉంది. 

అయితే చివరి నిమిషంలో నిందితుడు రపీ తన వాదనను మరోసారి విన్పించుకొనే అవకాశం కల్పించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో  రఫీ వాదనను కోర్టు వినే అవకాశం ఉంది. ఈ తరుణంలో  తుది తీర్పు ఇవాళ వచ్చే అవకాశం ఉందని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.

 బి. కొత్తకోట మండలం గట్టు పంచాయితీ గుట్టపాలెంకు చెందిన సిద్దారెడ్డి, ఉషారాణి దంపతుల కూతురు  వర్షిత, ఈ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు.  వైష్ణవి, వర్షిణి, వర్షిత.  2019 నవంబర్ 7న అంగల్లు సమీపంలోని చేనేత నగర్లో ఉన్న  కళ్యాణ మండపంలో బంధువుల పెళ్లి ఉండడంతో సిద్దారెడ్డి కుటుంబం ఈ పెళ్లికి హాజరైంది.

Also Read:ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య.. అనుమానితుడు అరెస్ట్

కళ్యాణ మండపంలోనే ఆడుకొన్న వర్షిణి అదే రోజు రాత్రి 10 గంటలకు కన్పించకుండాపోయింది. చిన్నారి కోసం  కుటుంబసభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు.  చిన్నారి వర్షితను నిందితుడు రపీ కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారం చేసి హత్యచేసినట్టుగా పోలీసులు కేసు నమోదు చేశారు. 

కళ్యాణ మండపానికి సమీపంలోనే నిర్మానుష్య ప్రదేశంలో చిన్నారి వర్షిత  డెడ్‌బాడీ లభ్యమైంది.రపీ లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. రపీ ప్రవర్తన సరిగా లేదని భార్య అతడిని వదిలి వెళ్లిపోయింది. ఓ కేసులో  రపీ రెండు మాసాలు జైలులో ఉండి వచ్చాడు. ఈ కేసులో ఫిబ్రవరి 18వ తేదీన ఇరు పక్షాల వాదనలు విన్న ట్రయల్  కోర్టు తీర్పును 24కు వాయిదా వేసింది. 

click me!