నందిగామలో కారులో మృతదేహం: ఎక్స్‌ప్రెస్‌ టీవీ అధినేతగా గుర్తింపు

Published : Feb 01, 2019, 07:38 AM ISTUpdated : Feb 01, 2019, 08:13 AM IST
నందిగామలో కారులో మృతదేహం: ఎక్స్‌ప్రెస్‌ టీవీ అధినేతగా గుర్తింపు

సారాంశం

కృష్ణా జిల్లా నందిగామలో కారులో మృతదేహం కలకలం రేపింది. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఐతవరం సమీపంలో తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో పెట్రోలింగ్ పోలీసులు ఒక కారును గుర్తించారు. 

కృష్ణా జిల్లా నందిగామలో కారులో మృతదేహం కలకలం రేపింది. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఐతవరం సమీపంలో తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో పెట్రోలింగ్ పోలీసులు ఒక కారును గుర్తించారు. దగ్గరకి వెళ్లి చూడగా అందులో ఒక వ్యక్తి మృతదేహం కనిపించింది.

అతనిని విజయవాడకు చెందని ప్రముఖ పారిశ్రామిక వేత్త, కోస్టల్ బ్యాంక్ అధినేత చిగురుపాటి జయరామ్‌గా గుర్తించారు. ఆయన బెజవాడ నుంచి ఇక్కడికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నారా లేదంటే ఎవరైనా హత్య చేసి ఇక్కడ వదిలి వెళ్లారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే విషప్రమోగం చేసినట్లుగా ఖాకీలు అనుమానిస్తున్నారు. కారులో మద్యం బాటిళ్లు ఉండటంతో వాటిలో విషం కలిపారా అన్నదానిపైనా ఆరా తీస్తున్నారు. ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు మరణానికి కారణమయ్యాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టానికి తరలించారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే