బతికి ఏం సాధిస్తారంటూ.. తల్లిదండ్రుల చేతిలో పురుగుల మందు పెట్టి..

By telugu news teamFirst Published Aug 11, 2020, 9:00 AM IST
Highlights


కాగా.. ఇటీవల వారికి అనారోగ్యం మందగించింది. వయసు పెరగడం వల్ల అనారోగ్యాలు దరిచేరాయి. దీంతో.. ఇదే విషయాన్ని కూతుళ్ల దగ్గర వాపోయారు. అయినా వారు పట్టించుకోలేదు. గతంలో ఖాసీం సైదాకి గుండెనొప్పి వస్తే.. ఇద్దరు కూతుళ్లు కనీసం సహాయం కూడా చేయలేదు. 

కంటే కతూరునే కనాలి అంటారు. ఎందుకంటే.. కొడుకు పెళ్లి తర్వాత మారిపోయినా..   కన్నకూతురు మాత్రం కళ్లల్లో పెట్టుకొని చూసుకుంటుందని అందరూ భావిస్తారు. ఈ తల్లిదండ్రుల విషయంలో మాత్రం అలా జరగలేదు. ఇద్దరు ఆడపిల్లలు పుడితే.. అల్లారుముద్దుగా పెంచారు. తమ రెక్కల కష్టంతోనే ఉన్నత చదువులు చదివించారు. తీరా ఓ కూతురికి ప్రభుత్వ ఉద్యోగం వస్తే.. పొంగిపోయారు. కానీ ఆ కూతురే వారి పట్ల నిర్దయగా ప్రవర్తించింది. వయసు మీద పడిన తల్లిదండ్రులకు పట్టెడు అన్నం పెట్టడానికి కనీసం చేతులు రాలేదు.  చేతిలో పురుగుల మందు డబ్బా పెట్టి చచ్చిపోమ్మని సలహా ఇచ్చింది. దీంతో ఆ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన గుంటూరులో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుంటూరు జిల్లా రెంటచింతల మండలం మంచిగల్లు గ్రామానికి చెందిన ఖాసీం సైదా, మస్తాన్ బీ దంపతులు. వ్యవసాయం చేసుకుంటూ.. ఇద్దరు ఆడపిల్లలను చదవించారు. వారిలో ఒక అమ్మాయికి కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. దీంతో వారు సంబరపడిపోయారు. ఆ కూతురు తమను జీవితాంతం హాయిగా చూసుకుంటుందని సంబరపడ్డారు. ఇద్దరికీ తమ తాహతు తగిన పెళ్లిళ్లు కూడా చేశారు.

కాగా.. ఇటీవల వారికి అనారోగ్యం మందగించింది. వయసు పెరగడం వల్ల అనారోగ్యాలు దరిచేరాయి. దీంతో.. ఇదే విషయాన్ని కూతుళ్ల దగ్గర వాపోయారు. అయినా వారు పట్టించుకోలేదు. గతంలో ఖాసీం సైదాకి గుండెనొప్పి వస్తే.. ఇద్దరు కూతుళ్లు కనీసం సహాయం కూడా చేయలేదు. దీంతో.. వాళ్ల వద్ద ఉన్న కొద్దిపాటి పొలాన్ని అమ్మి చికిత్స చేయించుకున్నారు.

ఇప్పుడు వారి వయసు 80కి దగ్గరలో పడింది. ఈ క్రమంలో ఖాసీం సైదాకి పక్షవాతం వచ్చింది. ఇప్పుడు కూడా కూతుళ్లు పట్టించుకోకపోవడంతో.. మిగిలిన పొలాన్ని అమ్మకానికి పెట్టారు. ఈ విషయం తెలసిన కానిస్టేబుల్ కూతురు రంగంలోకి దిగి నానా రచ్చ చేసింది. ఆ పొలం తమకు చెందుతుందని ఎలా అమ్ముతారంటూ ప్రశ్నించింది.

అంతేకాకుండా.. ఈ వయసులో బతికి ఏం సాధిస్తారు.. చచ్చిపోండి అంటూ చేతిలో పరుగుల డబ్బా పెట్టడం గమనార్హం. కాగా.. దీంతో.. ఆస్తి కోసం కూతుళ్లు తమను చంపేస్తారనే భయం వారిలో మొదలైంది. దీంతో వెంటనే వారు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

click me!