జగద్ధాత్రి ఆత్మహత్య: ఫ్యామిలీని వదిలేసి రామతీర్థతో... కూతురితో మాటల్లేవు

By telugu teamFirst Published Aug 25, 2019, 11:47 AM IST
Highlights

జగద్ధాత్రి కుటుంబాన్ని వదిలేసి ప్రముఖ రచయిత, కవి రామతీర్థతో సహజీవనం చేస్తూ వచ్చారు. విద్యార్థి దశలో రామతీర్థ, జగద్ధాత్రి ప్రేమించుకున్నారు.  గుండెపోటుతో రామతీర్థ మేలో మరణించారు.

విశాఖపట్నం: ప్రముఖ రచయిత్రి పూసల జగద్ధాత్రి డిప్రెషన్ తోనే ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. జగద్ధాత్రి ఆత్మహత్య తెలుగు సాహితీలోకాన్ని తీవ్ర కలవరానికి గురి చేసిన విషయం తెలిసిందే. శనివారంనాడు ఆమె ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. 

జగద్ధాత్రి కుటుంబాన్ని వదిలేసి ప్రముఖ రచయిత, కవి రామతీర్థతో సహజీవనం చేస్తూ వచ్చారు. విద్యార్థి దశలో రామతీర్థ, జగద్ధాత్రి ప్రేమించుకున్నారు.  గుండెపోటుతో రామతీర్థ మేలో మరణించారు. అప్పటి నుంచి ఆమె డిప్రెషన్ కు గురయ్యారు. ఆమె రాసిన సూసైడ్ నోటును బట్టి కూడా అదే అర్థమవుతోంది.

రామతీర్థతో జగద్ధాత్రి సహజీవనం కారణంగా ఇరు కుటుంబాలను విచ్ఛిన్నం చేసింది. రామతీర్థ సంతాప సభలో ఆ విషయం పూర్తిగా బయటపడింది. వేదిపైనే జగద్ధాత్రిని రామతీర్థ కూతురు కొట్టింది కూడా. తనకు, తన తండ్రికి మధ్య చీలిక తెచ్చిందని ఆమె ఆరోపించింది. జగద్ధాత్రి కూతురు కూడా ఆమెతో మాట్లాడడం మానేసింది. 

ఈ పరిస్థితిలో కూడా జగద్ధాత్రి అంత్యక్రియలు చేయడానికి ఆమె భర్త శివప్రసాద్ ముందుకు వచ్చారు. డిప్రెషన్ కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటునట్లు ఆమె సూసైడ్ నోటులో రాసింది. రాజేష్ ను ఉద్దేశించి మరో లేఖ రాసింది. ఇంటిలోని ఫర్నీచర్ ను, తన కారును తీసుకోవాల్సిందిగా రాజేష్ కు సూచించింది. బ్యాంక్ డాక్యుమెంట్లు మాత్రం తన భర్తకు ఇవ్వాలని రాజేష్ కు రాసిన లేఖలో చెప్పింది. 

సంబంధిత వార్త

ప్రముఖ తెలుగు రచయిత్రి జగద్ధాత్రి ఆత్మహత్య

click me!