తీరాన్ని దాటిన ‘‘దయె’’ తుఫాన్.. వణుకుతున్న ఉత్తరాంధ్ర

By sivanagaprasad kodatiFirst Published 21, Sep 2018, 7:45 AM IST
Highlights

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘‘దయె’’ తుఫాను తీరాన్ని దాటింది.. గోపాల్‌పూర్‌కు పశ్చిమ వాయువ్య దిశలో 40 కిలోమీటర్లు.. భవానీ పట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 130 కి.మీ దూరంలో కేంద్రీకృతమైయుంది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘‘దయె’’ తుఫాను తీరాన్ని దాటింది.. గోపాల్‌పూర్‌కు పశ్చిమ వాయువ్య దిశలో 40 కిలోమీటర్లు.. భవానీ పట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 130 కి.మీ దూరంలో కేంద్రీకృతమైయుంది. రానున్న 6 గంటల్లో ‘‘దయె’’ తుఫాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడనుంది.

దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణ, ఒడిషాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల తీరం వెంబడి ఉప్పెన మాదిరిగా సముద్రం ముందుకు పొంగే అవకాశం ఉందని హెచ్చరించింది. శుక్రవారం సాయంత్రం వరకు తుఫాను ప్రభావం ఉండనుంది.

గుడిసెలు, విద్యుత్తు తీగలు, స్తంభాలు, రహదారులు, పంటలు ధ్వంసమయ్యే అవకాశం ఉందని వివరించింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలో మత్స్యకారులెవరూ బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. 

Last Updated 21, Sep 2018, 7:45 AM IST