మోహన్ బాబుపై బుద్ధా కామెంట్స్.. మండిపడ్డ దాసరి ఫ్యామిలీ

Published : Apr 02, 2019, 03:01 PM IST
మోహన్ బాబుపై బుద్ధా కామెంట్స్.. మండిపడ్డ దాసరి ఫ్యామిలీ

సారాంశం

సినీనటుడు మోహన్ బాబు పై ఇటీవల బుద్ధా వెంకన్న తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కాగా... బుద్ధా చేసిన కామెంట్స్ పై దర్శకరత్న దాసరి నారాయణరావు కుటుంబసభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

సినీనటుడు మోహన్ బాబు పై ఇటీవల బుద్ధా వెంకన్న తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కాగా... బుద్ధా చేసిన కామెంట్స్ పై దర్శకరత్న దాసరి నారాయణరావు కుటుంబసభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

మోహన్ బాబుపై బుద్ధా చేసిన కామెంట్స్ వెనక్కి తీసుకోవాలని దాసరి కుటుంసభ్యులు కోరుతున్నారు. మోహన్‌బాబును విమర్శిస్తూ.. దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు గురించి ప్రస్తావించడంపై ఆయన కుటుంబసభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మోహన్‌బాబు తమకు పెద్ద అన్నయ్యలాంటి వారు అని, దాసరి చనిపోయిన తరువాత అన్ని ఆయనే చూసుకుంటున్నారని దాసరి నారాయణరావు పెద్ద కొడుకు తారకప్రభు తెలిపారు.

దాసరి నారాయణరావుకు మోహన్ బాబు పంగనామాలు పెట్టారని బుద్ధా వెంకన్న అన్నారని, ఈ వ్యాఖ్యలను ఆయన వెంటనే వెనక్కి తీసుకోవాలని  తారకప్రభు కోరారు. తాము ఎప్పుడైనా, ఎక్కడైనా మోహన్ బాబు తమను మోసం చేశారని చెప్పమా? తాము  చెప్పకుండా  ఇలాంటి కామెంట్స్ ఎలా చేస్తారని ప్రశ్నించారు.  

దాసరి నారాయణరావు గారి పెద్ద కోడలు పద్మ స్పందిస్తూ.. ‘మోహన్‌బాబు నన్ను అమ్మా అని పిలుస్తారు. నన్ను కూతురిలా ఆయన చూసుకుంటారు. మా రెండు కుటుంబాలు సన్నిహితంగా ఉంటాయి. బుద్ధా వెంకన్నగారూ.. మీ మాటలను వెనక్కి తీసుకోండి. రాజకీయాల కోసం మా కుటుంబాన్ని ఇందులోకి లాగకండి’ అని హితవు పలికారు.
 

PREV
click me!

Recommended Stories

నన్ను సార్ అంటే చాక్లెట్ ఇవ్వాలి విద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Nara Lokesh Fun With Students
Nara Lokesh Speech: టీడీపీ కార్యకర్తలకు పూనకాలు తెప్పించే నారాలోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | TDP