మీరు మా ఇంటికి రావాలి.. బుద్ధాపై మంచు విష్ణు

Published : Apr 02, 2019, 01:44 PM IST
మీరు మా ఇంటికి రావాలి.. బుద్ధాపై మంచు విష్ణు

సారాంశం

టీడీపీ నేత బుద్ధా వెంకన్న గత మూడు, నాలుగు రోజులుగా.. సినీనటుడు, వైసీపీ నేత మోహన్ బాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

టీడీపీ నేత బుద్ధా వెంకన్న గత మూడు, నాలుగు రోజులుగా.. సినీనటుడు, వైసీపీ నేత మోహన్ బాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా బుద్ధా కామెంట్స్ కి మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా గట్టిగా సమాధానం ఇచ్చారు.

‘‘TDP MLC బుద్ధా వెంకన్న గారు నోరు ఉంది కదా అని ఊరికే పారేసుకోకండి.. ఎలెక్షన్స్ ఉండేది ఇంకో పది రోజులే.. దాని తర్వాత.. మీరు మా ఇంటికి రావాలి.. మేము మీ ఇంటికి రావాలి.. ఒకళ్లనొకళ్లు ముఖాలు చూసుకోవాలి..’’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

మరో ట్వీట్ లో..‘‘ఎలక్షన్స్ లో మీరూ విమర్శించొచ్చు.. మేము మిమల్ని విమర్శించొచ్చు, కానీ డీసెన్సీ ఉండాలి. అన్నిటికి ఒక హద్దు ఉంటుంది. నెల రోజుల ముందు తిరుపతికి వచ్చి మా ఇంట్లో కూర్చొని ఏం మాట్లాడారో మర్చి పోకండి.’’ అని పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu