దళిత యువతితో ప్రేమాయణం, ప్రియురాలి సోదరుడికి నగ్నవీడియోలు.. మనస్తాపంతో

Siva Kodati |  
Published : Nov 06, 2021, 04:38 PM IST
దళిత యువతితో ప్రేమాయణం, ప్రియురాలి సోదరుడికి నగ్నవీడియోలు.. మనస్తాపంతో

సారాంశం

శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆముదాలవలస మండలం కొత్తచెలికానివలసలో ప్రియుడి మోసాన్ని తట్టుకోలేక దళిత యువతి ఆత్మహత్యకు పాల్పడింది. 

శ్రీకాకుళం (srikakulam district) జిల్లా రేగిడి ఆముదాలవలస మండలం కొత్తచెలికానివలసలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో దళిత యువతిని లొంగదీసుకున్నాడు హరీశ్ అనే యువకుడు. ఆ తర్వాత ఆశ్లీల వీడియోలతో వేధించాడు. ఆ వీడియోలను యువతి సోదరుడికి కూడా పంపించాడు. విషయం బయటకు చెబితే చంపుతానని బెదిరించాడు. తన ప్రియుడు చేసిన అవమానాన్ని భరించలేక  ఆత్మహత్యకు (suicide) పాల్పడింది యువతి. ఈ నెల 31న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధిత యువతికి న్యాయం చేయాలని దళిత, ప్రజా సంఘాలు కోరుతున్నాయి.  ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్