అమరావతి రైతుల మహాపాదయాత్రకు సోమవారం సెలవు..

By team teluguFirst Published Nov 6, 2021, 4:21 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) ఏకైక రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్‌తో అమరావతి ప్రాంత రైతులు, మహిళలు మహాపాదయాత్ర (amaravati farmers padayatra) చేపట్టిన సంగతి తెలిసిందే. సోమవారం ఈ పాదయాత్రకు సెలవు ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) ఏకైక రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్‌తో అమరావతి ప్రాంత రైతులు, మహిళలు మహాపాదయాత్ర (amaravati farmers padayatra) చేపట్టిన సంగతి తెలిసిందే. సోమవారం ఈ పాదయాత్రకు సెలవు ప్రకటించారు. కార్తీక సోమవారం కావడంతో పాదయాత్రకు సెలవు ప్రకటించాలని అమరావతి రైతులు నిర్ణయం తీసుకున్నారు. ఇక, అమరాతి పరిరక్షణే ధ్యేయంగా రాజధాని ప్రాంత రైతులు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట పాదయాత్రను ముందుకు సాగిస్తున్నారు. శనివారం ఈ పాదయాత్ర ఆరో రోజుకు చేరింది. ఆదివారం రాత్రి ప్రకాశం జిల్లా ఇంకొల్లుక మహాపాదయాత్ర చేరుకోనుంది. 

Also read: ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని టీడీపీ పోరుబాట.. నవంబర్ 9న ధర్నాలు.. జగన్‌పై చంద్రబాబు ఫైర్..

సోమవారం సెలవు ప్రకటించిన నేపథ్యంలో.. మంగళవారం ఉదయం ఇంకొల్లు నుంచి యథావిథిగా పాదయాత్ర కొనసాగుతుందని నిర్వాహకులు వెల్లడించారు. తమ పాదయాత్రకు ప్రజల నుంచి మద్దతు వస్తుందని, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా జనాలు మద్దతు తెలుపుతున్నారని నిర్వాహకులు వెల్లడించారు. కాంగ్రెస్, టీడీపీ, బీజీపీ, సీపీఐ నేతలు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి మూడు రాజధానులు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అమరావతి ప్రాంత రైతులు కోరుతున్నారు. 

న్యాయ స్థానం నుంచి దేవస్థానం వరకు.. 
సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా.. అమరావతి ప్రాంత రైతులు, మహిళలు పోరాటం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలని.. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు ఉద్యమ కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే న్యాయస్థానం నుంచి దేవస్థానం మహా పాదయాత్ర చేపట్టానలి అమరావతి రైతులు నిర్ణయించారు. అయితే ఇందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. రైతుల తరఫు వాదనలతో ఏకీ భవించిన కోర్టు.. పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది.

Also read: YS Jagan: నవంబర్ 9న శ్రీకాకుళం జిల్లాకు సీఎం వైఎస్ జగన్.. షెడ్యూల్ ఇదే..

దీంతో రైతులు నవంబర్ 1వ తేదీన మహా పాదయాత్రను ప్రారంభించారు. 45 రోజుల పాటు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో ఈ పాదయాత్ర సాగనుంది. తుళ్లూరు నుంచి తిరుపతి వరకు కొనసాగనుంది. నవంబరు 1 నుంచి డిసెంబరు 17 వరకు సాగేలా షెడ్యూల్ ఖరారు చేశారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా సాగనుంది. రైతుల పాదయాత్రకు టీడీపీ, కాంగ్రెస్.. పార్టీలు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.

click me!