ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని మానవీయత.. ఆటో దగ్గరకెళ్లి వృద్ధుడి పెన్షన్‌ పునరుద్ధరణకు ఆదేశాలు

By telugu team  |  First Published Nov 6, 2021, 4:33 PM IST

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తన మానవీయతను చాటుకున్నారు. ఏలూరులోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజా వినతులు స్వీకరిస్తూ పక్షవాతంతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఓ వ్యక్తిని గమనించారు. వెంటనే ఆటో వద్దకు వెళ్లి ఆయనతో మాట్లాడి, సమస్యలు తెలుసుకున్నాడు. ఆ వ్యక్తి పింఛన‌్‌ను వెంటనే పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.
 


అమరావతి: Andhra Pradesh ఉపముఖ్యమంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి Alla Naniమానవీయతను చాటుకున్నారు. ప్రజలకు తనదైన శైలిలో సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. Coronavirus కష్టకాలంలోనూ వైద్యపరంగాఎన్నో సేవలు అందించి ప్రజల మనసులో నిలిచారు. అంతేకాదు, రాష్ట్ర వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. అంతేకాదు, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న Eluruలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరిస్తున్నారు.

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ఉప ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆళ్ల నాని ఓ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలోనే ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తన మానవీయతను చాటుకున్నారు.

Latest Videos

Also Read: ఏలూరు: ఆశ్రమం ఆసుపత్రిలో కరోనా రోగి మృతి.. విచారణకు ఆళ్ల నాని ఆదేశం

ఈ కార్యక్రమంలో తన గోడును ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానితో చెప్పుకోవడానికి మపటి వేంకట కుందరావు వచ్చారు. ఆయన ఎన్నో ఏళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. వైద్య సేవలు పొందడానికీ ఆయన దగ్గర డబ్బు లేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ డబ్బులతోనే జీవిస్తున్నాడు. కానీ, కొంత కాలంగా ఆ పింఛన్ కూడా ఆగిపోయింది. దీంతో తీవ్ర దిగులుతో దినదిన గండంగా జీవితం సాగిస్తున్నాడు. తన గాధను మంత్రికి చెప్పుకోవడానికి ఉప ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసుకు వచ్చాడు. కానీ, ఆరోగ్యం సహకరించక కనీసం నడవలేని పరిస్థితి ఆయనది.

ఏలూరు ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజా వినతులు స్వీకరిస్తున్న సమయంలో మంత్రి ఆళ్ల నాని ఆయనను గమనించారు. నడవలేని పరిస్థితిలో ఉన్న ఆ వ్యక్తిని చూసి చలించిపోయారు. వెంటనే ఆటోలో ఉన్న ఆ వ్యక్తి వద్దకు పరుగున వెళ్లారు. ఆయన సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయనకు తక్షణమే పింఛన్ మంజూరు చేయాలని సబంధిత అధికారులను ఆదేశించారు.

Also Read: ప్రైవేట్ ఆసుపత్రుల దందా: అధిక ఫీజులపై 104కి కాల్ చేయండి.. ప్రజలకు ఆళ్ల నాని సూచన

తక్షణమే పెన్షన్ పునరుద్ధరించాలని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఆదేశించడంతో మపటి వేంకట కుందరావు కుటుంబం అంతా హర్షం వ్యక్తం చేశారు. ఆనంద భాష్పాలతో మంత్రి ఆళ్ల నానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎవరు ఆపదలో ఉన్న సకాలంలో స్పందించి బాధితులను ఆదుకోవడమే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని నైజం అంటూ అక్కడే ఉన్న ఇరుగు పొరుగు వారు అనుకున్నారు.

click me!