అనకాపల్లిలో దళిత యువకుడి దారుణ హత్య, కాళ్లు, చేతులు కట్టేసి, బావిలో పడేసి...

Published : Mar 01, 2023, 09:20 AM IST
అనకాపల్లిలో దళిత యువకుడి దారుణ హత్య, కాళ్లు, చేతులు కట్టేసి, బావిలో పడేసి...

సారాంశం

అర్థరాత్రి ఇంట్లోనుంచి వెళ్లిన ఓ దళిత యువకుడు తెల్లారేసరికి బావిలో శవంగా తేలాడు. కాళ్లూ, చేతులు కట్టేసి వ్యవసాయ బావిలో మృతదేహంగా దొరకడం పలు అనుమానాలు దారితీస్తోంది. 

అనకాపల్లి : ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో అనుమానాస్పద మృతి కలకలం రేపింది. అర్ధరాత్రి ఇంట్లో నుంచి వెళ్లిన ఓ యువకుడు తెల్లారేసరికి బావిలో శివమే కనిపించాడు. దీంతో ఆ తల్లి, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పి ఎల్ పురంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి  మృతుడి తల్లి, పోలీసులు, బంధువులు ఈ మేరకు వివరాలను తెలిపారు.. వడ్లమూరి నాగేంద్ర (21),  పి ఎల్ పురానికి చెందిన దళిత యువకుడు. 

మేడిశెట్టి సూర్యనారాయణ అనే అదే గ్రామానికి చెందిన రైతు దగ్గర గత నాలుగేళ్ల నుంచి వ్యవసాయ పనులు చేస్తున్నాడు.  నాగేంద్రకు ఇంకా వివాహం కాలేదు. తల్లి మరియమ్మతో కలిసి నాగేంద్ర ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో నాగేంద్ర ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఈ విషయం తల్లికి తెలియదు. మరియమ్మ మంగళవారం ఉదయం  నిద్ర లేచి చూసేసరికి కొడుకు కనిపించలేదు. అతని కోసం వెతికి ఆ తర్వాత కుమార్తెలు, బంధువులకు సమాచారం అందించింది.

వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి అధికారంలోకి వస్తాం: సోము వీర్రాజు

వారందరితో కలిసి కొడుకు కోసం గాలించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో సూర్యనారాయణ కు చెందిన వ్యవసాయ బాయి దగ్గర చెప్పులు, సెల్ ఫోను, టవల్ కనిపించాయి. అవి నాగేంద్రవిగా అనుమానించిన కుటుంబ సభ్యులు.. ఆందోళనతో బావిలోకి చూశారు. అక్కడ వారికి కనిపించిన దృశ్యం ఒక్కసారి దిగ్భ్రాంతికి గురిచేసింది. బావిలో కాళ్లు, చేతులు కట్టేసి నీటిలో శవంగా నాగేంద్ర కనిపించాడు. 

రాత్రి తనతో పాటు పడుకున్న కొడుకు తెల్లారి బావిలో శవమే కనిపించేసరికి ఆ తల్లి కన్నీరు మున్నీరుగా రోదిస్తోంది. బంధువులు ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలో నుంచి మృతదేహాన్ని బయటికి తీయించారు. కేసు నమోదు చేసుకున్నారు. కుటుంబ సభ్యుల నుంచి  నాగేంద్రకు సంబంధించిన వివరాలను సేకరించారు. క్లూస్ టీం కూడా  దర్యాప్తులో పాలుపంచుకుంది.  నాగేంద్ర మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నక్కపల్లి సిహెచ్.సికి తరలించారు.  సిఐ అప్పలరాజు మాట్లాడుతూ కేసు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ కంటే హైదరాబాద్ లోనే లోయెస్ట్ టెంపరేచర్స్ .. స్కూల్ టైమింగ్స్ చేంజ్
YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu