విశాఖలో దారుణం.. చెట్టుకు కట్టేసి దళిత యువకుడిపై మరో దళితుడు దాడి...

By SumaBala Bukka  |  First Published Jun 9, 2022, 7:20 AM IST

ఆంధ్రప్రదేశ్ లో దళితుడిపై దళితుడే దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువకుడిని చెట్టుకు కట్టేసి, చెప్పుతో కొట్టి.. దుర్భాషలాడుతూ హింసించారు. 


విశాఖపట్నం :  Visakhapatnam జిల్లా పెందుర్తి మండలం విజయవాడ లో అమానుషం చోటు చేసుకుంది. ఓ Dalit Youthని మరో దళిత వ్యక్తి చెట్టుకు కట్టేసి, చెప్పుతో కొట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది.  వారం రోజుల క్రితం చోటు చేసుకున్న ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పెందుర్తి పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వి.జుత్తాడకు చెందిన తారకేశ్వరరావు మద్యం తాగి,  వైసిపి నాయకుడిని అసభ్య పదజాలంతో దూషించి, అట్రాసిటీ కేసు పెడతానని బెదిరించాడు. 

మర్నాటి ఉదయం తన సెల్ఫోన్ దొంగిలించాడు అన్న ఆరోపణతో తారకేశ్వర రావును సూరిబాబు చెట్టుకు కట్టి, చెప్పుతో కొట్టి,  అసభ్య పదజాలంతో దూషించాడు. వైసిపి నాయకుడిని తిట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని విరుచుకుపడ్డాడు. మంగళవారం రాత్రి  ఇ మళ్లీ ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది.  సూరిబాబు చంపేస్తానని తారకేశ్వర రావు  బెదిరించినట్లు  గ్రామస్తులు చెబుతున్నారు.  సూరిబాబు  తారకేశ్వర రావుపై  కేసు పెడతానని హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో పాత  ఘటన వీడియోలు బయటకు వచ్చాయి. ఈ ఘటన స్థానిక ఎంపీటీసీ సభ్యుడి  ఇంటి సమీపంలోనే జరగడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Latest Videos

undefined

సెల్ఫోన్ దొంగిలించాడనే దాడి : సీఐ
తన సెల్ఫోన్ ను తారకేశ్వరరావు దొంగిలించాడనే సూరిబాబు అతనిని చెట్టుకు కట్టేసి కొట్టినట్లు పెందుర్తి సీఐ అశోక్ కుమార్ తెలిపారు ఈ వీడియో కలకలం రేపిన నేపథ్యంలో గ్రామంలో విచారణ చేశామన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడు సూరిబాబుపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. 

ఇలాంటి ఘటనే నిరుడు అక్టోబర్లో బెంగళూరులో కలకలం రేపింది. బెంగళూరులో అమానుష ఘటన జరిగింది. ముగ్గురు ప్రైమరీ స్కూలు విద్యార్థులను ఆరుగురు సభ్యుల ముఠా అక్టోబర్ 23 మధ్యాహ్నం చెట్టుకు కట్టేసి బలవంతంగా బీడీలు తాగించారు. ఈ ఘటన తూర్పు బెంగళూరులోని మహదేవ్‌పురాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో రెండు రోజుల తరువాత social media లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో 11-13 సంవత్సరాల వయస్సు గల నిస్సహాయ చిన్నారులు, తాము తాగలేమని.. తమను వెళ్లనివ్వమని గుంపును వేడుకోవడం అందరికీ కదిలించింది.

కేఆర్ పురం సమీపంలోని దేవసంద్ర వార్డులోని బీ నారాయణపురలోని బీబీఎంపీ స్కూల్ క్యాంపస్‌లో 5వ తరగతి విద్యార్థులు చిత్రహింసలకు గురయ్యారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఈ ప్రాంతంలో నిఘా పెంచడంలో, అల్లరి మూకలను కట్టడి చేయడంలో పోలీసులు విఫలమయ్యారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనూ ఇలాంటి వేధింపులు జరిగిన దాఖలాలు ఉన్నాయని.. పోలీసులు వారిని పట్టుకోలేకపోయారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మాజీ కార్పొరేటర్‌ చేసిన ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు ఈ ఘటనలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో వివేక్, 19, మహేష్, 18. మిగిలిన నలుగురికి 17 ఏళ్లు. వారిలో ఇద్దరు విద్యార్థులు అని తెలిసింది. ప్రాథమిక విచారణలో నిందితులు స్కూల్ గ్రౌండ్‌కు ఆడుకోవడానికి  వచ్చిన పిల్లలను దగ్గరికి పిలిచి.. ర్యాగింగ్ చేశారని తెలిసింది. వారు చెప్పినట్లు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారని తేలింది. 

 

click me!