ఎస్సీ మహిళ బట్టలూడదీసారు (వీడియో)

First Published Dec 20, 2017, 11:15 AM IST
Highlights
  • విశాఖపట్నం జిల్లాలో దారుణం చొటుచేసుకుంది

విశాఖపట్నం జిల్లాలో దారుణం చొటుచేసుకుంది. ఓ స్థల వివాదం లో ఎస్సీ మహిళ పట్ల కొందరు అనుచితంగా ప్రవర్తించారు. ఇంతకీ విషయం ఏమిటంటే,  జిల్లాలోని పెందుర్తి మండలం శివారులో జెర్రిపోతులపాలెం ఉంది. అక్కడ స్తానికుల్లో కొందరికి ఎస్సీలతో స్ధలం విషయంలో వివాదం మొదలైంది. సర్వే నంబర్ 77లో కొంత డీఫారం భూమి కాళీగా ఉంది. దాన్ని అధికారులు ఎన్టీఆర్ గృహ పథకం క్రింద కొందరు పేదలకు కేటాయించారు.

అయితే, స్ధలాన్ని చదును చేయటానికి అధికారులు ప్రయత్నించినపుడు అక్కడి ఎస్సీలతో గొడవైంది. అదే స్ధలం చాలా కాలంగా తమ ఆధీనంలో ఉన్నదంటూ అధికారులకు ఎస్సీలు అడ్డుపడ్డారు. దాంతో అధికారులకు ఓ ఎస్సీ కుటుంబానికి బాగా గొడవైంది. ఇంతలో టిడిపి నేతలు రంగంలోకి ప్రవేశించారు. ఓ మహిళ పట్ల  అధికారపార్టీ నేతలు దారుణంగా ప్రవర్తించారు.

ఓ ఎస్సీ మహిళను కొట్టి రోడ్డుపై పడేసారు. తర్వాత బట్టలూడదీసేసారు. దాంతో గొడవ మరింత పెద్దదైంది. సరే, స్ధానికుల జోక్యంతో గొడవ ఆగిపోయిందనుకోండి అది వేరే సంగతి. తనపట్ల అధికార పార్టీ ఉప ఎంపీపీ భర్త పై పెందుర్తి పోలిస్ స్టేషన్ లో సదరు మహిళ ఫిర్యాదు చేసింది. తనను కులం పేరుతొ దూసించటమే కాకుండా జుట్టుపట్టుకుని ఈడుచుకొని వెళ్లారని, తన రవిక చింపారు అని ఎస్పీ మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదుపై పొలీసులు సంఘటన స్తలానికి చేరుకొని విచారిస్తున్నారు

 

 

click me!