
అమరావతి: దగ్గుబాటి పురంధేశ్వరి ఈ నెల 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించనునన్ారు. ఆమె ఈ నెల 13వ తేదీన విజయవాడకు పర్యటించబోతున్నారు. పార్టీ కార్యాలయానికి ఆమె 13వ రాష్ట్ర అధ్యక్షులుగా విచ్చేస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ వెటుకూరి సూర్యనారాయణ రాజు తెలిపారు.
పురంధేశ్వరి పర్యటనను పార్టీ గ్రాండ్‌గా ప్లాన్ చేసింది. ఆమెకు భారీ స్వాగతం పలకాలని ప్రణాళికలు చేసింది. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు భారీ ర్యాలీ తీయనున్నారు. బీజేపీ జెండాలు, భారీ ఫ్లెక్సీలు, డెకరేషన్‌తో ఈ ర్యాలీ సాగుతుంది. గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద బీజేపీ శ్రేణులు, పార్టీ అనుబంధ సంస్థలు పురంధేశ్వరికి ఘన స్వాగతం పలకనున్నారు.
Also Read: కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసినందునే బండి సంజయ్‌ను తప్పించారు.. బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటే: వీహెచ్
అదే రోజు పురంధేశ్వరి అధికారికంగా రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. బీజేపీ కార్యకర్తలు నిర్వహించనున్న సమావేశంలో ఆమె పాల్గొంటారని వెటుకూరి సూర్యనారాయణ రాజు వెల్లడించారు.