ఏపీ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన పురందేశ్వరి.. జగన్ సర్కార్‌పై ప్రశ్నల వర్షం..

Published : Jul 13, 2023, 12:38 PM IST
ఏపీ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన పురందేశ్వరి.. జగన్ సర్కార్‌పై ప్రశ్నల వర్షం..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నూతన అధ్యక్షురాలిగా కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి  పురందేశ్వరి గురువారం బాధ్యతలు చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నూతన అధ్యక్షురాలిగా కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి  పురందేశ్వరి గురువారం బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన పురందేశ్వరికి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు‌తో పాటు పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరిస్తోందని చెప్పారు. అయితే బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అవినీతికి దూరంగా ఉండే పార్టీ అని చెప్పారు. 

విభజన బిల్లులో ఉన్న విధంగా ఏపీలో జాతీయ విద్యాసంస్థలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికలకు ముందు రైతులకు రూ. 12 వేలు ఇస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. కేంద్రం నిధులతో కలిపే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇస్తుందని చెప్పారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే 22 లక్షల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. కేంద్రం నిధులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లను నిర్మించడం లేదని అన్నారు. రాష్ట్రంలో ఇళ్లకు సంబంధించి 35 శాతం కూడా పూర్తి కాలేదని విమర్శించారు. 

రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజ్‌లో.. ప్రత్యేక హోదాలో జరిగే  లబ్దిని పొందుపరచడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో కేంద్రం తప్పితే రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన రోడ్లు ఎక్కడ అని  ప్రశ్నించారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితి ఏమిటనేది ప్రజలను అడిగితే తెలుస్తుందని అన్నారు. ఏపీకి పరిశ్రమలు తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం లేదని అన్నారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందని అన్నారు.

ఏపీలో రివర్స్ టెండరింగ్‌తో కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని విమర్శించారు. సీఎం సొంత బాబాయ్ హత్య కేసుని దర్యాప్తు చేయలేమని ప్రభుత్వం చేతులేత్తేసిందని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని అధికార పార్టీ ఎంపీ ఇంట్లో కిడ్నాపర్లు ఉన్నారంటే.. శాంతిభద్రతలు ఏ పరిస్థితిలో ఉన్నాయనే అర్థం చేసుకోవచ్చని చెప్పారు. 

పొలవరం పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని ప్రశ్నించారు. పోలవరం విషయంలో కేంద్రం ఎక్కడ జాప్యం చేయడం లేదని అన్నారు. పొలవరం నిర్మాణం చేయలేకపోతే కేంద్రానికి అప్పగించాలని అన్నారు. దశల వారీగా మద్యపాన నిషేధం హామీ ఏమైందని జగన్ సర్కార్‌ను ప్రశ్నించారు. నాణ్యత లేని మద్యంతో మహిళల పుస్తెలు తెగుతున్నాయని అన్నారు. సుపరిపాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ప్రైవేట్ మైనింగ్

కార్యకర్తల సహకారంతో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. పొత్తులు అనేది అధిష్టానం చూసుకుంటుందని అన్నారు. రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. జనసేన తమ మిత్రపక్షమేనని స్పష్టం చేశారు. జనసేనతో సమన్వయం చేసుకుంటామని చెప్పారు. పవన్ నిన్న ఉన్నాం.. మెన్న ఉన్నాం.. రేపు ఉంటామని చెప్పారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu