వైసీపీకి భారీ షాక్.. విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీకి పంచకర్ల రాజీనామా..

Published : Jul 13, 2023, 09:59 AM ISTUpdated : Jul 13, 2023, 10:03 AM IST
వైసీపీకి భారీ షాక్.. విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీకి పంచకర్ల రాజీనామా..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు బిగ్ షాక్ తగిలింది. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న పంచకర్ల రమేష్ బాబు.. తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు బిగ్ షాక్ తగిలింది. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న పంచకర్ల రమేష్ బాబు.. తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. జిల్లా వైసీపీలో జరుగుతున్న పరిణామాలపై పంచకర్ల రమేష్ బాబు  కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే పార్టీ, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపించారు. అయితే పెందుర్తి టికెట్ విషయంలో ఎదురుదెబ్బ తగలడంతోనే తన అనుచరులతో సమావేశమైన రమేష్ బాబు.. వారితో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 

వైసీపీకి గుడ్ బై చెప్పిన సందర్భంగా పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. అధ్యక్షుడుగా ఎవరికైనా పదవుల్లో న్యాయం జరగకపోతే క్షమాపణ కోరుతున్నానని అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. చాలా బాధగా ఉందని అన్నారు. ఏడాది కాలంగా ఎన్నో సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించానని చెప్పారు. అందుకు వీలు కాలేదని తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యలను తీర్చలేనప్పుడు పదవిలో ఉండి ఏం లాభమని ప్రశ్నించారు. తనకు, ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న టీటీడీ  చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఎలాంటి విబేధాలు లేవని పేర్కొన్నారు. 

కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన రమేష్ బాబు రెండు దశాబ్దాల క్రితం వైజాగ్‌కు వలస వచ్చి వ్యాపారంలో స్థిరపడ్డాడు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ  టిక్కెట్‌పై పెందుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  ఆ తర్వాత పీఆర్‌పీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో.. ఆ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగారు. అయితే 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే 2020లో పంచకర్ల రమేష్ బాబు వైసీపీ గూటికి చేరారు. వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనను వైసీపీ తీసుకురావడంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, అప్పుడు మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాసరావు కీలక పాత్ర పోషించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!