
ఉత్తరాంధ్రకు (north andhra) తుఫాను (cyclone jawad) ముప్పు తప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో (bay of bengal) ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా బలపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇది విశాఖకు ఆగ్నేయంగా 200 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 310 కి.మీ దూరంలో జవాద్ తుఫాను కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చిన అనంతరం దిశ మార్చుకున్న తుపాను ప్రస్తుతం మందగమనంతో ఒడిశా (Odisha) వైపు కదులుతోందని అధికారులు వెల్లడించారు. గడిచిన 6 గంటలుగా ఇది గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్టు వాతావరణ విభాగం తెలియజేసింది.
కొద్దిగంటల్లోనే ఇది తీవ్ర వాయుగుండంగా బలహీనపడే సూచనలు ఉన్నట్టు ఐఎండీ తెలిపింది. ఇదే వేగంతో కదులుతూ రేపు మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ తీరానికి చేరుకునే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించింది. అనంతరం మరింత బలహీనపడి పశ్చిమ బెంగాల్ (west bengal) వైపుగా కదిలే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ (imd) తెలిపింది. తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర తీరప్రాంతాల్లో గంటకు 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. రాగల 24 గంటల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని ఐఎండీ తెలిపింది.
ALso Read:Cyclone Jawad: విశాఖలో హైఅలర్ట్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మోహరింపు
అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై cyclone jawad తీవ్ర ప్రభావాన్ని చూసే అవకాశం ఉందని Imd శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. విశాఖపట్టణంలో రెస్క్యూ సిబ్బందిని అందుబాటులో ఉంచారు.మూడు Ndrfబృందాలతో పాటు 45 మందితో Sdrf సిబ్బందిని రంగంలోకి దించారు. జీవీఎంసీ పరిధిలో 21 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. Visakhapatnam జిల్లాలోని ఏడు రిజర్వాయర్లలో అత్యవసర పరిస్థితుల్లో నీటిని విడుదల చేయడానికి ఇరిగేషన్ అధికారులను సిద్దం చేశారు.
Gvmc, రెవిన్యూ, పోలీస్, పంచాయితీరాజ్, రోడ్లు భవనాల శాఖాధికారులతో సమన్వయం చేసుకొంటూ సహాయక చర్యలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. cyclone ప్రభావంతో గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటే చెట్లు విరిగిపడే ప్రమాదం ఉంది. దీంతో జేసీబీలతో పాటు చెట్లను కట్ చేసే యంత్రాలను కూడా సిద్దం చేసుకొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. విశాఖలో control రూమ్స్ ఏర్పాటు చేశారు. 0891-2590100,0891-2590102,0891-2750090, నెంబర్లకు ఫోన్లు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.