తూర్పుగోదావరిలో ఉద్ధృతి.. ఏపీలో కొత్తగా 186 కరోనా కేసులు, 20,70,681కి చేరిన సంఖ్య

Siva Kodati |  
Published : Dec 04, 2021, 06:55 PM IST
తూర్పుగోదావరిలో ఉద్ధృతి.. ఏపీలో కొత్తగా 186 కరోనా కేసులు, 20,70,681కి చేరిన సంఖ్య

సారాంశం

ఏపీలో కొత్తగా 186 కరోనా కేసులు (corona cases in ap) నమోదవ్వగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 191 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,149 మంది చికిత్స పొందుతున్నారు  

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) గడిచిన 24 గంటల్లో 186 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,70,681కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,448కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 191 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,54,084 చేరింది. గత 24 గంటల వ్యవధిలో 32,036 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,05,39,041కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,149 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 11, చిత్తూరు 21, తూర్పుగోదావరి 32, గుంటూరు 11, కడప 4, కృష్ణ 28, కర్నూలు 4, నెల్లూరు 9, ప్రకాశం 9, శ్రీకాకుళం 9, విశాఖపట్నం 20, విజయనగరం 2, పశ్చిమ గోదావరిలలో 26 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu