బంగాళాఖాతంలో ‘‘గజ’’....ఏపీకి పొంచివున్న మరో తుఫాను ముప్పు

By sivanagaprasad kodatiFirst Published Nov 11, 2018, 1:07 PM IST
Highlights

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తుఫానుగా రూపుదాల్చింది. దీనికి వాతావరణ శాఖ ‘‘గజ తుఫాను’’గా నామకరణం చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రస్తుతం ఇది పోర్ట్‌బ్లెయిర్‌కు 400 కి.మీ, చెన్నైకి 900 కి.మీ, నెల్లూరుకి 1050 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. 

ఇది తీవ్ర తుఫానుగా మారి ఈ నెల 15 నాటికి చెన్నై-నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గజ ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 11 నాట్ల వేగంతో కదులుతున్నట్లు వెల్లడించింది.

దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో దక్షిణ, ఉత్తర తమిళనాడు తీరాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. తుఫాను ప్రభావం ప్రకాశం, నెల్లూరు జిల్లాలపై ఉంటుందని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

click me!