మరిదితో అక్రమ సంబంధం, నిద్రలో ఉన్న భర్తను ఏం చేసిందంటే....

Published : May 02, 2019, 08:10 AM ISTUpdated : May 02, 2019, 08:13 AM IST
మరిదితో అక్రమ సంబంధం, నిద్రలో ఉన్న భర్తను ఏం చేసిందంటే....

సారాంశం

ఈ నేపథ్యంలో గత శనివారం రాత్రి తాగిన శంకర్ నిద్రలో ఉండగా విజయ తన ప్రియుడు సపావత్ కిషన్ తో కలిసి అతడి ముఖంపై దిండుతో అదిమి హత్య చేశారు. అనంతరం శంకర్ కరెంట్ షాక్ తో చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు.   

హైదరాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తాళికట్టిన భర్తను ప్రియుడుతో కలిసి దారుణంగా హత్య చేసింది భార్య. డిండి మండలం దేవత్ పల్లితండాకు చెందిన బానోవత్ దులియా అలియాస్ శంకర్ భార్య విజయ తన ఇద్దరు పిల్లలతో కలిసి నగరానికి వలస వచ్చి చైతన్య పురి యాదవనగర్ లో నివసిస్తున్నాడు.

అయితే విజయ మరిది వరసయ్యే సపావత్ కిషన్ తో గత కొన్నేళ్లుగా వివాహేతర సంబందం పెట్టుకుంది. ఈ విషయాన్ని గుర్తించిన శంకర్ ఆమెను మందలించడంతో అతడి అడ్డు తొలగించేందుకు ప్రియుడితో కలిసి పథకం పన్నింది. 

ఈ నేపథ్యంలో గత శనివారం రాత్రి తాగిన శంకర్ నిద్రలో ఉండగా విజయ తన ప్రియుడు సపావత్ కిషన్ తో కలిసి అతడి ముఖంపై దిండుతో అదిమి హత్య చేశారు. అనంతరం శంకర్ కరెంట్ షాక్ తో చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. 

భార్య విజయ ప్రవర్తనపై అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన చైతన్యపురి పోలీసులు విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న మృతుడు భార్య విజయ, ప్రియుడు సపావత్ కిషన్ ను బుధవారం అరెస్ట్ చేశారు. విచారణలో తామే శంకర్ ను హత్య చేసినట్లు అంగీకరించినట్లు ఏసీపీ పృథ్వీరావ్ స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu