బంగాళాఖాతంలో పెరిగిన ఫణి తుఫాన్ వేగం

By narsimha lodeFirst Published Apr 30, 2019, 1:33 PM IST
Highlights

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఫణి తుఫాన్ గంటకు 16 కి.మీ వేగంతో తీరం వైపు కదులుతోందని వాతావరణ శాఖ అధికారులు  ప్రకటించారు. మరో 12 గంటల్లో ఫణి తుఫాన్ పెను తుఫాన్‌గా మారే అవకాశం ఉంది.


అమరావతి:  ఆగ్నేయ బంగాళాఖాతంలో ఫణి తుఫాన్ గంటకు 16 కి.మీ వేగంతో తీరం వైపు కదులుతోందని వాతావరణ శాఖ అధికారులు  ప్రకటించారు. మరో 12 గంటల్లో ఫణి తుఫాన్ పెను తుఫాన్‌గా మారే అవకాశం ఉంది. మరో 24 గంటల్లో అతి తీవ్ర పెను తుఫాన్‌గా మారే అవకాశాలు ఉన్నాయని  ఐఎండీ హెచ్చరిస్తోంది.

మే 4వ తేదీన ఈ పెను తుఫాన్‌ ఒడిశా తీరం దాటి పశ్చిమ బెంగాల్ దిశగా పయనిస్తోందన్నారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ నుండి  అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని  వాతావరణ శాఖ హెచ్చరించింది.

పెను తుఫాన్ గమన ప్రాంతంలో గంటకు  170కి.మీ. నుంచి 200 కి.మీ.తో ప్రచండ గాలులు వీస్తాయని వాతావరణ శాఖాధికారులు  హెచ్చరించారు. ఈ తుఫాన్ ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో  గంటకు సుమారు 50 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ  ప్రకటించింది. ఆ తర్వాతి రోజుకు గాలుల తీవ్రత 60 నుండి 85 కి.మీ. వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

దూసుకొస్తున్న ఫణి: ఉత్తరాంధ్రపై ప్రభావం

 

click me!