టంగ్ స్లిప్ అయితే నాలుక కోస్తాం: జేసీకి సీఐ వార్నింగ్

Published : Sep 20, 2018, 09:11 PM ISTUpdated : Sep 20, 2018, 09:15 PM IST
టంగ్ స్లిప్ అయితే నాలుక కోస్తాం: జేసీకి సీఐ వార్నింగ్

సారాంశం

ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై ఏపీ పోలీసుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. టంగ్ స్లిప్ అయితే నాలుక తెక్కోస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎంపీలు ఎమ్మెల్యేలు పోలీసులను ఇష్టమెుచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదంటూ హెచ్చరించారు. 

అనంతపురం: ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై ఏపీ పోలీసుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. టంగ్ స్లిప్ అయితే నాలుక తెక్కోస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎంపీలు ఎమ్మెల్యేలు పోలీసులను ఇష్టమెుచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదంటూ హెచ్చరించారు. జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు పోలీసు వ్యవస్థనే కించపరిచేలా ఉన్నాయని సీఐ గోరంట్ల మాధవ్ ఆరోపించారు. 

మేమూ రాయలసీమ వాసులమేనన్న సీఐ అసభ్యపదజాలంతో మేమూ మాట్లాడగలమన్నారు. రాజకీయ నాయకులకు కొమ్ము కాయడానికి పోలీసు వృత్తిలోకి రాలేదన్నారు. దివాకర్‌రెడ్డి పోలీసులకు క్షమాపణ చెప్పాలని సీఐ గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు. తాము మగాళ్లమయ్యే ఉద్యోగాలు చేస్తున్నామని శిఖండి కాదన్నారు. పోలీసులే కాదు పొలిటికల్ లీడర్లు ఫెయిల్ కారా అని ప్రశ్నించారు. 

 రూలింగ్ లో ఉన్నవారు రూలింగ్ లో లేనివారు ఇష్టం వచ్చినట్లు పోలీసులపై  ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇద్దరూ ఇద్దరే అంటూ వైసీపీ, అటు డీపీలకు వార్నింగ్ ఇచ్చారు సీఐ మాధవ్. పోలీసులను తిడితేకొమ్ములు వస్తాయనుకుంటున్నారు అని మండిపడ్డారు. 

నేతల మాటలతో భార్య బిడ్డలకు ముఖాలు చూపించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని సీరియస్ గా తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే