విజయవాడలో ప్రత్యేక రక్షణ దళం సైకిల్ ర్యాలీ

By ramya neerukondaFirst Published Nov 1, 2018, 2:27 PM IST
Highlights

ప్రకాశం బ్యారేజీ నుంచి సచివాలయం వరకు ఈ సైకిల్ ర్యాలీ చేపట్టారు. దాదాపు 300మంది పాల్గొన్న ఈ ర్యాలీకి ప్రత్యేక రక్షణ దళం కమాండెంట్ డాక్టర్ కొండా నరసింహారావు న్యాయకత్వం వహించారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ప్రకటించిన జాతీయ సమైక్యతా దినోత్సవంలో భాగంగా బుధవారం ఏపీ ప్రత్యేక రక్షణ దళం వియవాడలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి సచివాలయం వరకు ఈ సైకిల్ ర్యాలీ చేపట్టారు. దాదాపు 300మంది పాల్గొన్న ఈ ర్యాలీకి ప్రత్యేక రక్షణ దళం కమాండెంట్ డాక్టర్ కొండా నరసింహారావు న్యాయకత్వం వహించారు.

ఈ ర్యాలీ ప్రకాశం బ్యారేజీ నుంచి ఉండవల్లి జంక్షన్, పెనుమాక, మందడం మీదగా సచివాలయం చేరుకుంది. నలుగురు దళానికి సంబంధించిన సభ్యులు ప్రత్యేక దుస్తులు ధరించి రెండు మోటారు సైకిళ్లపైన ర్యాలీలో ముందు భాగంలో ఉన్నారు. వారిలో ఒకరు జాతీయ పతాకం, మరొకరు దళం చిహ్నంతో ఉన్న జెండా పట్టుకున్నారు.

ర్యాలీ జరిగిన తీరు ప్రజలను బాగా ఆకట్టుకుంది. ర్యాలీ సచివాలయం చేరుకోగానే.. రక్షణ దళ సిబ్బంది చప్పట్లు కొడుతూ స్వాగతం పలికారు. ర్యాలీ సచివాలయం 2వ బ్లాక్ వద్ద కొద్దిసేపు నిలిపి కమాండెంట్ డాక్టర్ నరసింహారావు రెండు సార్లు అఖండ శంకారావాన్ని పూరించి, ర్యాలీలో పాల్గొన్న వారిని అభినందించారు. 

సచివాలయం లోపల ర్యాలీ నిర్వహించి, గేటు వద్ద మంచినీరు తాగి  భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేసి తిరిగి ర్యాలీ కొనసాగించారు. దాదాపు 50కిలోమీటర్లు సాగిన ఈ ర్యాలీని మళ్లీ ప్రకాశం మ్యారేజీ వద్ద ముగించారు. 

click me!