
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించేందుకు కేంద్రం అనుమతి నిచ్చింది.
ఆయన పదవీ కాలాన్ని జులై 1 నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకూ పొడిగిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మర్యాద పూర్వకంగా ఆదిత్యనాథ్ దాస్ ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. ఆయన సర్వీసును జూలై 1వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించింది.రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ సేవలను మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది.
వాస్తవానికి ఆదిత్యా నాధ్ దాస్ ఈనెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఈ పొడిగింపుతో ఆదిత్యా నాధ్ దాస్ మరో మూడు మాసాల పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని పదవీకాలం ముగిసిన తర్వాత ఆదిత్యనాథ్ దాస్ ఆ స్థానంలో నియమితులయ్యారు.