ఏపీలోని 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షల్లో సడలింపు: మిగతా ఐదు జిల్లాలో యధాతథం

Published : Jun 28, 2021, 01:42 PM IST
ఏపీలోని 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షల్లో సడలింపు: మిగతా ఐదు జిల్లాలో యధాతథం

సారాంశం

ఏపీలోని 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షల్లో సడలింపులు ఇస్తూ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాజిటీవిటీ రేటు తక్కువగా ఉండడంతో ఈఠ జిల్లాల్లో ఆంక్షల్లో సడలింపులు ఇచ్చారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 8 జిల్లాల్లో కర్ప్యూ ఆంక్షలను సడలిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నతస్థాయి సమావేశంలో సోమవారం సమీక్షించారు. 

ఈ సమీక్షా సమావేశంలో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కోవిడి పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉన్న జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షల్లో సడలింపులు ఇస్తున్నారు. 

ఈ సడలింపులు జులై 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అమలులో ఉంటాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ఎనిమిది జిల్లాల్లో ఆంక్షలను సడలించారు. మిగతా ఐదు జిల్లాల్లో యథాతథంగా ఆంక్షలు కొనసాగుతాయి. 

ప్రకాశం, ఉభయ గోదావరి, కృష్ణా,  చిత్తూరు జిల్లాల్లో కర్ఫ్యూ యథాథంగా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఉంటుంది. ఈ జిల్లాల్లో కోవిడ్ పాజిటివిటి రేటును పరిశీలించిన తర్వాత ఆంక్షలను సడలించే విషయంపై నిర్ణయం తీసుకుంటారు. 
 

PREV
click me!

Recommended Stories

పిల్ల‌లు కాదు పిశాచాలు.. టీచ‌ర్‌పై దాడి చేసి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి. వీడియో చూస్తే ఒళ్లు మండాల్సిందే.
Chintha Vijay Prathap Reddy: జగ్గయ్యపేట అంగన్వాడీ కేంద్రాలపై ఫుడ్ కమిషన్ తనిఖీ| Asianet News Telugu